Amit Shah: ఆయుధాలు వీడకుంటే ఆలౌట్ ఆపరేషన్!
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:57 AM
నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నక్సలైట్లు హింసను వీడి లొంగిపోవాలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన 55 మంది నక్సల్స్ హింస బాధితులను శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ 2026, మార్చి 31 వరకు మాత్రమే మావోయిస్టులు తమ చివరి శ్వాస తీసుకోగలుగుతారని, అప్పటికి దేశంలో నక్సలిజం లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మాట వినకుంటే నక్సల్స్ ముప్పునకు ముగింపు పలికేందుకు ‘ఆలౌట్ ఆపరేషన్’ చేపడతామని అమిత్‌షా హెచ్చరించారు.
నక్సలిజం అటు దేశ ప్రజలకు, ఇటు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయ విజయం సాధించాయని, మోదీ సర్కార్ విధానాలతో వామపక్ష తీవ్రవాద సమస్య ఇప్పుడు చత్తీ్‌సగఢ్‌లోని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైందని అమిత్‌షా పేర్కొన్నారు. మావోయిస్టులు గతంలో నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని ప్లాన్ వేశారని, అయితే మోదీ ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేసిందన్నారు. నక్సలైట్ల మానవ హక్కుల గురించి చెప్పేవాళ్లు.. నక్సలిజం బాధితుల హక్కుల గురించి కూడా ఆలోచన చేయాలని అమిత్‌షా హితవు పలికారు. ఛత్తీ్‌సగఢ్‌లోని నక్సల్స్ హింస ప్రభావిత ప్రజల కోసం కేంద్ర హోంశాఖ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ఒక సమగ్ర సంక్షేమ పథకాన్ని రూపొందించనున్నదని తెలిపారు.
విశ్వకర్మలకు విపణి చేరువ
ప్రపంచ మార్కెట్లో చేనేత రంగానికి గొప్ప గౌరవం దక్కేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని తెలిపారు. విశ్వకర్మ కమ్యూనిటీలకు గత ప్రభుత్వాలు చేసింది ఏమీలేదన్నారు. కేవలం ఏడాది కాలంలో 18 రకాల వృత్తులకు చెందిన 20 లక్షల మంది పీఎం విశ్వకర్మ పథకంలో చేరారని, 8 లక్షల మంది నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీల్లో, 5 వేల పట్టణ స్థానిక సంస్థల్లో విశ్వకర్మ పథకం అమలవుతోందన్నారు. హస్త కళాకారులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అందుబాటులో ఉందని తెలిపారు. కాగా, విశ్వకర్మ పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా స్మారక తపాలా బిళ్లను ప్రధాని ఆవిష్కరించారు. అమరావతిలో 1000 ఎకరాల్లో నిర్మించనున్న పీఎం మెగా ఇంటెగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్, అపరెల్‌పార్క్(పీఎం-మిత్ర)కు ప్రధాని శంకుస్థాపన చేశారు.