Bangalore: ప్రియుడు అబార్షన్ చేయించాడని న్యాయం కోరుతూ ప్రధానికి లేఖ
ABN, Publish Date - Aug 02 , 2024 | 01:09 PM
బలవంతంగా అబార్షన్ చేయించిన ప్రియుడిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తగిన న్యాయం జరిపించాలని కోరుతూ బాధిత మహిళ ప్రధానమంత్రి(Prime Minister)కి లేఖ రాసిన విషయం రామనగర జిల్లాలో గురువారం వెలుగు చూసింది.
బెంగళూరు: బలవంతంగా అబార్షన్ చేయించిన ప్రియుడిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తగిన న్యాయం జరిపించాలని కోరుతూ బాధిత మహిళ ప్రధానమంత్రి(Prime Minister)కి లేఖ రాసిన విషయం రామనగర జిల్లాలో గురువారం వెలుగు చూసింది. న్యాయం జరగకపోతే రామనగర ఎస్పీ కార్యాలయం(Ramanagara SP Office) ముందు ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో ప్రస్తావించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రామనగరలో ఓ నర్సుగా పనిచేసిన బాధిత మహిళకు ఆరేళ్లక్రితం వివాహం కాగా కొద్దిరోజులకే భర్త వదిలేశాడు. ఆ తర్వాత దయానంద్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. శారీరకంగా సన్నిహితం కావడంతో గర్భందాల్చినట్లు లేఖలో ప్రస్తావించారు.
ఇదికూడా చదవండి: Chikun Gunya: తమిళనాడులో.. పెరుగుతున్న చికున్‌గున్యా
ఒత్తిడి చేయించి అబార్షన్ చేయించారని ఈమేరకు రామనగర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దయానంద్(Dayanandh)పై పోలీసుల ద్వారా న్యాయం జరిపిస్తానని, అతడి ఫ్రెండ్ 1.40 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఆ సొమ్మును సర్కిల్ ఇన్‌స్పెక్టర్(Circle Inspector) లంచంగా తీసుకున్నారని అయినా న్యాయం జరగలేదని బాధిత మహిళ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు దయానంద్‌కు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె లేఖలో పేర్కొంది.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Updated Date - Aug 02 , 2024 | 01:09 PM