ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu and Kashmir Elections: జమాత్, ఇంజనీర్ రషీద్, ఆజాద్‌.. అడ్రెస్ గల్లంతు

ABN, Publish Date - Oct 08 , 2024 | 04:26 PM

పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా, చిన్న పార్టీలకు మాత్రం ఈ ఎన్నికల్లో గ్రహణం పట్టింది.

శ్రీనగర్: పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా, చిన్న పార్టీలకు మాత్రం ఈ ఎన్నికల్లో గ్రహణం పట్టింది. ఈ పార్టీలు కూడా ఇటీవల వరకూ వార్తల్లో ప్రముఖంగానే ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆ పార్టీలకు మొండిచేయి చూపించాయి.


ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి నిషేధిత 'జమాత్-ఇ-ఇస్లా్మి' ఎన్నికల ప్రక్రియలోకి అడుగుపెట్టింది. దశబ్దాలుగా ఎన్నికలను బహిష్కరిస్తూ వచ్చిన జమాతే ఈసారి ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకుంటుందని అంతా అంచనా వేశారు. ఇంజనీర్ రషీద్‌కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ అనూహ్యంగా జమాత్‌తో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను ఇంజనీర్ రషీద్ ఓడించడంతో అంచనాలు కూడా ఎక్కువయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో జమాత్‌ మద్దతుతో 10 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. అయితే వారిలో కొంత మంది ఆ తర్వాత నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జమాత్ మద్దతుతో దిగిన అభ్యర్థులంతా ఎన్నికల ఫలితాల కౌటింగ్‌లో తమ తమ నియోజవర్గాల్లో వెనకబడ్డారు.

PM Modi: గెలుపు దిశగా హర్యానా.. మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు


లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ఇంజనీర్ రషీద్ 'మార్క్' ఎక్కడా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం మరో విశేషం. ఆయన పార్టీ మద్దతిచ్చిన ఒకే ఒక అభ్యర్థి, అదికూడా ఇంజనీర్ రషీద్ తనయుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. పీడీపీ అభ్యర్థి ఆ తర్వాత రౌండ్లలో పుంజుకున్నారు.


ఆజాద్‌కు చుక్కెదురు

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కేంద్రంలో కీలక పదవులు నిర్వహించిన గులాం నబీ ఆజాద్ 2022లో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని సొంతంగా 'డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ'ని స్థాపించారు. ఆయన పార్టీ సైతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వెనకబడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ పార్టీ మూడు స్థానాలకు పోటీ చేసి ఆ మూడింట్లోనూ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడారు.


ఓటమికి కారణాలేంటి?

కాగా, ఈ పార్టీల ఓటమికి కారణాలేమిటనే దానిపై విశ్లేషకుల అంచనాలు మొదలయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఓట్లను చీల్చేందుకే బీజేపీ ఈ పార్టీలను తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు ఉండటమే ప్రధాన కారణంగా వీరు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారం కోసం ఇంజనీర్ రషీద్‌కు బెయిల్ ఇవ్వడం కూడా ఈ అభిప్రాయాలకు ఊతం ఇచ్చిందంటున్నారు. మెహబూబా ముఫ్తీకి బీజేపీతో సాన్నిహిత్యం ఉందనే అభిప్రాయం కూడా పీడీపీని దెబ్బతీసిందని అంటున్నారు. ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం శ్రీగుఫ్వారా-బిజెహార నియోజకవర్గం నుంచి ఓటమిని చవిచూశారు. 2018లో జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం కుప్పకూలేంత వరకూ బీజేపీతో కలిసి మెహబూబూ ముఫ్తీ ప్రభుత్వాన్ని నడిపారు. ఆ తర్వాత ఏడాదికి 370 అధికరణను కేంద్రం రద్దు చేసి జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది.


For More National News and Telugu News..

ఇది కూడా చదవండి..

Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ

Updated Date - Oct 08 , 2024 | 04:26 PM