Karva Chauth 2024: పెళ్లికాని అమ్మాయిలు ఈ పూజ చేస్తే.. అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ రావాల్సిందే..!
ABN, Publish Date - Oct 20 , 2024 | 11:30 AM
సాంప్రదాయకంగా కర్వా చౌత్ అనే పండుగ తమ భర్తల శ్రేయస్సు కోసం మహిళలు ఉపవాసం పాటించే ప్రక్రియ. ఇప్పుడు పెళ్లికాని స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని పాటించవచ్చు. అయితే అవివాహిత స్త్రీలు ఈ ఉపవాసం పాటించే నియమాలు, పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్వా చౌత్ (Karva Chauth 2024) పండుగను వివాహిత హిందూ మహిళలతోపాటు పెళ్లి కాబోయే యువతులు కూడా ఆచరిస్తారు. ఈసారి కర్వా చౌత్ చంద్రోదయ సమయం అక్టోబర్ 20, 2024న రాత్రి 07:54 గంటలకు కనిపిస్తుంది. కర్వా చౌత్ చంద్రోదయ సమయం వేర్వేరు ప్రదేశాలలో భిన్నంగా ఉంటుంది. ఈ పండుగ నేపథ్యంలో మహిళలు తమ భర్తల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ పురాతన సంప్రదాయం వైవాహిక ప్రేమ, ఐక్యతను సూచిస్తుంది. పౌర్ణమి నాల్గవ రోజున, మహిళలు ఆహారం, నీరు మానేసి కఠినమైన ఉపవాసం చేస్తారు.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ
అక్టోబర్ 20, 2024 ఆదివారం నాడు కర్వా చౌత్ పవిత్ర ఉపవాసాన్ని మహిళలు పాటిస్తారు. చంద్రుడు ఉదయించగానే తమ భర్త ముఖాన్ని జల్లెడలో చూస్తూ ఉపవాస దీక్ష విరమిస్తారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని మహిళలు ప్రధానంగా ఈ పండుగను జరుపుకుంటారు. కర్వా చౌత్‌ను కరక్ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది భార్యాభర్తల మధ్య పవిత్ర బంధాన్ని బలపరుస్తుంది.
పెళ్లి కానీ వారు చేస్తే
కర్వా చౌత్ సాంప్రదాయకంగా వివాహిత మహిళలకు మాత్రమే కేటాయించబడినప్పటికీ, త్వరలో వివాహం చేసుకోబోయే లేదా వివాహం చేసుకోవాలనుకునే అవివాహిత స్త్రీలు కూడా దీనిని జరుపుకుంటారు. నిశ్చితార్థం చేసుకున్న లేదా త్వరలో వివాహం చేసుకోబోయే స్త్రీలు కొంతమంది తమ కాబోయే భర్త లేదా ప్రియుడి గౌరవార్థం ప్రేమ, భక్తిని ప్రదర్శించడానికి ఉపవాసం ఉంటారు. పెళ్లికాని స్త్రీలు కర్వా చౌత్‌ను పాటించకూడదని హిందూ గ్రంధాలు స్పష్టంగా చెప్పలేదు. దీంతో చాలామంది స్త్రీలు తమకు మంచి వరుడు రావాలని కూడా ప్రార్థిస్తారు.
కర్వా చౌత్ 2024: అవివాహిత స్త్రీలు ఉపవాసం పాటించే నియమాలు, పద్ధతులు
- అవివాహిత స్త్రీలు కర్వా చౌత్ నాడు పండ్లు తినవచ్చు, ఎందుకంటే వారికి నిర్జల ఉపవాసం తప్పనిసరి కాదు
- కర్వా చౌత్ పూజ సమయంలో అవివాహిత స్త్రీలు వివాహితలతో కూర్చోకూడదు, వారితో ప్లేట్లు మార్చుకోకూడదు
- పెళ్లి కాని అమ్మాయిలు కర్వా చౌత్‌లో తమ చేతులకు మెహందీని అప్లై చేసుకోవచ్చు.
- పెళ్లి కాని యువతులు సంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో తమను తాము అలంకరించుకోవాలి
- అవివాహిత స్త్రీలు కర్వా చౌత్ సమయంలో శివుడిని, పార్వతి దేవిని, కర్వమాతను పూజించాలి
- యువతులు వారి భవిష్యత్ వివాహం కోసం దైవిక జంట ఆశీర్వాదాలపై దృష్టి పెట్టాలి. వారు కర్వా చౌత్ కథను కూడా వినాలి
- అవివాహితులు చంద్రోదయం కోసం ఎదురుచూడకుండా, జల్లెడ అవసరం లేకుండా, నక్షత్రాలకు పూజలు చేయడం ద్వారా ఉపవాసం విరమించుకోవచ్చు
ఇవి కూడా చదవండి:
Blast: సీఆర్‌పీఎఫ్ స్కూల్ సమీపంలో పేలుడు.. ఘటనా స్థలానికి అధికారులు
India A: ఉత్కంఠ మ్యాచ్.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 20 , 2024 | 11:53 AM