ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gyanvapi Temple: జ్ఞానవాపి మసీదుపై సంచలన నివేదిక.. హిందూ ఆలయం ఆనవాళ్లు

ABN, Publish Date - Jan 25 , 2024 | 10:34 PM

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంచలన నివేదిక ఇచ్చింది. మసీదు కన్నా ముందు ఇక్కడ హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ తెలిపింది. హిందూ ఆలయాన్ని కూల్చేసి, ఈ మసీదుని నిర్మించారని ఈ నివేదిక పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సంచలన నివేదిక ఇచ్చింది. మసీదు కన్నా ముందు ఇక్కడ హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ తెలిపింది. హిందూ ఆలయాన్ని కూల్చేసి, ఈ మసీదుని నిర్మించారని ఈ నివేదిక పేర్కొంది. ఈ మసీదు కింది భాగంలో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, భారీ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ గుర్తించింది.

17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి ఈ జ్ఞానవాపి మసీదుని నిర్మించారని ఈ నివేదిక తేల్చింది. మసీదు దక్షిణ భాగంలోని గోడ హిందూ ఆలయంలో భాగమేనని అనుమానాలు వ్యక్తం చేసింది. 32 హిందూ శాసనాలను సైతం గుర్తించిన పురావస్తు శాఖ.. ఆ శాసనాలు దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నట్లు తెలిపింది. హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను కొద్దిగా చెక్కి, మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ నివేదిక కాపీలను హిందూ, ముస్లిం లాయర్లకు పురావస్తు శాఖ పంపింది.


ఈ సందర్భంగా.. హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ, జ్ఞానవాపి మసీదుని నిర్మించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారని నివేదిక సూచిస్తోందని అన్నారు. మసీదు లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయని అన్నారు. ఈ మసీదులో చాలా మార్పులు చేయబడ్డాయని నివేదిక చెప్తోందని తెలిపారు. చిన్న చిన్న మార్పులతో స్తంభాలను, ప్లాస్టర్‌లను తిరిగి ఉపయోగించినట్లు ఈ నివేదిక సూచిస్తోందన్నారు. సర్వేలో మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయని స్పష్టం చేశారు.

హిందూ దేవాలయానికి చెందిన కొన్ని స్తంభాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించేందుకు సవరించబడ్డాయని జైన్ చెప్పారు. స్తంభాలపై చెక్కిన శిల్పాలను తొలగించేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. దేవనాగరి, తెలుగు, కన్నడతో పాటు ఇతర లిపిలలో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలు కూడా కనుగొనబడ్డాయన్నారు. ఈ శాసనాలతో పాటు మరమ్మత్తులు, ఇతర నిర్మాణాలు.. ఇక్కడ హిందూ దేవాలయం ఉందని చెప్పడానికి సాక్ష్యాలని జైన్ చెప్పుకొచ్చారు.

Updated Date - Jan 25 , 2024 | 10:34 PM

Advertising
Advertising