ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections Breaking: కన్నడనాట ప్రారంభమైన పోలింగ్.. వివరాలివే

ABN, Publish Date - Apr 26 , 2024 | 06:45 AM

దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ శుక్రవారం ఉదయమే ప్రారంభమైంది. కాగా.. కర్ణాటకలో(Karnataka) తొలి దశలో జరుగుతున్న పోలింగ్ ఇది. రాష్ట్రంలో రెండు దశల్లో 28 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

బెంగళూరు: దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ శుక్రవారం ఉదయమే ప్రారంభమైంది. కాగా.. కర్ణాటకలో(Karnataka) తొలి దశలో జరుగుతున్న పోలింగ్ ఇది. రాష్ట్రంలో రెండు దశల్లో 28 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మే 7న రెండో విడతలో పోలింగ్ నిర్వహించనుండగా.. ఇవాళ 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26న బెంగళూరు సెంట్రల్‌తో పాటూ... ఉత్తర, దక్షిణ బెంగళూరు, చిక్కబళ్ళాపుర, కోలారు, ఉడుపి, చిక్కమంగళూరు, హాసన్‌, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, తుముకూరు, మాండ్య, మైసూరు, చామరాజనగర ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది.


ఎన్నికలు జరిగే 14 స్థానాల్లో 247 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 2కోట్ల 88లక్షల 19వేల ఓటర్లు ఉండగా.. 30వేల 602 పోలింగ్‌ ఏర్పాటు చేశారు.

Uttar Pradesh: రాయ్‌ బరేలీలో పోటీకి వరుణ్‌ గాంధీ ‘నో’!

పోలింగ్‌ నిర్వహణకు 2.50 లక్షల మంది సిబ్బందిని కేటాయించారు. 19 వేల 701 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ క్యాస్టింగ్‌, 1,370 కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవాంఛిత ఘటనలు జరగకుండా ఆయా పోలింగ్ కేంద్రాల్లో భారీగా భద్రత బలగాలు మోహరించాయి. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించారు.

ఓటు వేసిన ప్రముఖులు

కర్ణాటకలో ఉదయమే ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.

మల్లేశ్వరంలో కుటుంబ సభ్యులతో కలసి టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఓటు వేశారు. జయనగర్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఆయన భార్య సుధా మూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 26 , 2024 | 09:20 AM

Advertising
Advertising