Share News

Maharashtra and Jharkhand Assembly Elections: శరద్ పవార్‌కు బిగ్ షాక్.. వారంతా అజిత్ పవార్‌ వైపు మొగ్గు

ABN , First Publish Date - Nov 23 , 2024 | 07:16 AM

Maharashtra and Jharkhand Assembly Election Results 2024 LIVE Counting: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండగా.. జార్ఖండ్‌లో ఇండియా కూటమి 50 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తూ విజయం దిశగా దూసుకెళ్తోంది.

Maharashtra and Jharkhand Assembly Elections: శరద్ పవార్‌కు బిగ్ షాక్.. వారంతా అజిత్ పవార్‌ వైపు మొగ్గు
Breaking News

Live News & Update

  • 2024-11-23T14:13:19+05:30

    ఎన్సీపీ(శరద్ పవార్) తొలి విజయం

    • మహారాష్ట్రలోని మధ శాసనసభ స్థానంలో గెలిచిన ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ

    • ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ నుంచి గెలిచిన అభిజిత్ ధనుంజయ్ పాటిల్

  • 2024-11-23T13:17:40+05:30

    లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఇలా..

    • దేశ వ్యాప్తంగా రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక

    • మహారాష్ట్రలోని నాందేడ్, కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక

    • వయనాడ్ లోక్‌సభ స్థానంలో ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యం

    • గెలుపు దిశగా ప్రియాంకగాంధీ

    • నాదేండ్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యం

  • 2024-11-23T13:07:07+05:30

    మహారాష్ట్ర ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..

    • మహారాష్ట్ర ఫలితాల్లో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీకి బిగ్ షాక్

    • కేవలం 12 స్థానాల్లోనే ఆధిక్యంలో ఎన్సీపీ (శరద్ పవార్)

    • అజిత్ పవార్ ఎన్సీపీకి ఊహించని విజయం

    • 39 స్థానాల్లో ఎన్సీపీ (అజిత్ పవార్ ఆధిక్యం)

    • పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటని అజిత్ పవార్

    • అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఎన్సీపీ

    • ఎన్సీపీ(శరద్ పవార్) కంటే ఉద్ధవ్ శివసేన అధిక సీట్లలో ఆధిక్యం

    • 19 సీట్లలో ఉద్ధవ్ శివసేన ఆధిక్యం

  • 2024-11-23T12:57:41+05:30

    మహారాష్ట్ర ఫలితాలపై కూటమి నేతల హర్షం..

    • మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ బీజేపీ నేతల హర్షం

    • కొన్నిచోట్ల స్వీట్లు పంచుకుంటున్న నాయకులు

    • మహారాష్ట్ర విజయంపై బీజేపీ రాజానగరం నియోజకవర్గం కన్వీనర్ నీరుకొండ వీరన్నచౌదరి హర్షం

    • అభివృద్ధికి మహారాష్ట్ర ప్రజలు పట్టంకట్టారన్న వీరన్న చౌదరి

    • మోదీ నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజలు విశ్వాసం ఉంచారన్న బీజేపీ నేతలు

    • మహిళలు బీజేపీకి పట్టం కట్టారన్న వీరన్న చౌదరి

  • 2024-11-23T12:40:30+05:30

    మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్పందన

    • మహారాష్ట్ర ఫలితాలపై స్పందించిన సీఎం చంద్రబాబు

    • ఎన్డీయే కూటమి నేతలకు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

  • 2024-11-23T12:00:56+05:30

    మహారాష్ట్రలో తొలి విజయం

    • మహారాష్ట్రలో తొలి విజయం

    • వడాల శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపు

    • 30వేల మెజార్టీతో ఉద్ధవ్ శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి కాళీదాస్ నీల్‌కాంత్ కోలంబ్కర్ విజయం

  • 2024-11-23T11:46:17+05:30

    మహారాష్ట్ర సీఎం రేసులో ఫడ్నవీస్

    • మహారాష్ట్ర సీఎం రేసులో ఫడ్నవీస్

    • ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతల సమావేశం

    • సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేస్తారని ప్రకటించిన బీజేపీ నేత ప్రవీణ్ థరేకర్

    • బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

    • ఎన్నికల్లో షిండేనే సీఎం అంటూ ప్రచారం

  • 2024-11-23T11:36:25+05:30

    ఉద్దవ్ ఠాక్రే శివసేనకు బిగ్ షాక్

    • ఉద్దవ్ ఠాక్రే శివసేనకు బిగ్ షాక్

    • ఉద్దవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ స్థానంలో వెనుకంజ

    • ఆదిత్యపై 597 ఓట్ల ఆధిక్యంలో షిండే శివసేన అభ్యర్థి మిలింద్ మురళి

  • 2024-11-23T10:12:01+05:30

    బారామతిలో అజిత్ పవార్ లీడ్

    • బారామతి శాసనసభ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ లీడ్

    • రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 7,111 ఓట్ల మెజార్టీ

  • 2024-11-23T09:58:56+05:30

    వయనాడ్‌లో ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యం

    • వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక

    • భారీ ఆధిక్యంలో ప్రియాంక గాంధీ

    • 68,521 ఓట్ల మెజార్టీలో ప్రియాంక గాంధీ

    • మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్

  • 2024-11-23T09:51:04+05:30

    ఎంఐఎంకు భారీ ఆధిక్యం..

    • ఔరంగాబాద్ ఈస్ట్‌లో ఎంఐఎంకు భారీ మెజార్టీ

    • రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి 15,211 ఓట్ల లీడ్

    • ఎస్పీ అభ్యర్థి అబ్దుల్ సయ్యద్‌పై ఇంతియాజ్ జలీల్ సయ్యద్ ఆధిక్యం

  • 2024-11-23T09:33:46+05:30

    మెజార్టీ మార్క్‌కు చేరువలో మహాయుతి

    • మెజార్టీ మార్క్‌ చేేరుకున్న మహాముతి కూటమి

    • తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి 150 స్థానాల్లో మహాయుతి కూటమి లీడ్

    • 151 స్థానాల్లో మహాయుతి లీడ్

    • 99 స్థానాల్లో మహా వికాస్ అఘాడీ లీడ్

    • మహాయుతిలో బీజేపీ 92, శివసేన(షిండే) 41, ఎన్సీపీ(అజిత్ పవార్) 19 స్థానాల్లో లీడ్

  • 2024-11-23T09:29:07+05:30

    ముఖ్యమైన స్థానాల్లో లీడ్స్

    • వర్లీ స్థానంలో శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి ఆదిత్య థాకరే ఆధిక్యం

    • నాగపూర్ సౌత్ వెస్ట్‌లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లీడ్

    • తొలి రౌండ్ పూర్తయ్యేసరికి 2246 ఓట్ల ఆధిక్యం

  • 2024-11-23T08:39:25+05:30

    జార్ఖండ్‌లో పోటాపోటీ..

    • జార్ఖండ్‌లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

    • స్వల్ప అధిక్యం కనబరుస్తున్న ఎన్డీయే కూటమి

    • పోటాపోటీగా ఎన్డీయే, యూపీఎ కూటముల మధ్య పోరు

    • యూపీఎ కంటే మూడు స్థానాల్లో ఎన్డీయే అధిక్యం

  • 2024-11-23T08:35:07+05:30

    మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో లీడ్ ఎవరికంటే..

    • మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు

    • పోస్టల్ బ్యాలెట్లలో మహాయుతి కూటమికి లీడ్

    • మహావికాస్ అఘాడీ, మహాయుతి మధ్య టఫ్ ఫైట్

    • గెలుపుపై ఇరు పక్షాల ధీమా

    • కాసేపట్లో ప్రారంభం కానున్న ఈవీఎంల ఓట్ల లెక్కింపు

    • ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగస్తుల ఓటు

    • పోస్టల్ బ్యాలెట్లలో లీడ్ రావడంతో ఈవీఎం ఓట్లు అనుకూలంగా వస్తాయనే అంచనాలో మహాయుతి కూటమి

    • మహారాష్ట్రలో కీలకంగా మారిన మహిళల ఓట్లు

  • 2024-11-23T08:11:29+05:30

    ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు

    • ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం (43) కాంగ్రెస్ (30),

    • ఆర్జేడీ (6), సీపీఐఎంఎల్ (2) స్థానాల్లో పోటీ

    • ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ (68),

    • AJSU ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (10),

    • జేడీయూ (2), లోక్ జన శక్తి (1) స్థానంలో పోటీ

    • ఝార్ఖండ్‌లో మ్యాజిక్ ఫిగర్ 42

  • 2024-11-23T08:09:15+05:30

    పోటీ చేసింది వీరే..

    • మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు

    • మహారాష్ట్రలో 145 మ్యాజిక్ ఫిగర్

    • మహారాష్ట్రలో మహాయుతి కూటమిగా బీజేపీ (149), ఏక్ నాథ్ షిండే శివసేన (81),

    • అజిత్ పవార్ ఎన్సీపీ(59) స్థానాల్లో పోటీ

    • మహా వికాస్ అఘాడి కూటమిలో భాగంగా కాంగ్రెస్ (101),

    • ఉద్ధవ్ ఠాక్రే శివసేన (95), శరద్ పవార్ ఎన్సీపీ (86) స్థానాల్లో పోటీ

    • మహారాష్ట్ర ఎన్నికల్లో 237 మంది అభ్యర్థులను బరిలోకి దింపిన బీఎస్పీ

    • మజ్లిస్ నుంచి 17 మంది పోటీ

    • 156 అసెంబ్లీ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు పోటీ

  • 2024-11-23T08:06:45+05:30

    గెలుపుపై ఎన్డీఏ, ఇండియా కూటమి ధీమా

    • మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపుపై ఎన్డీఏ, ఇండియా కూటమిల ధీమా

    • మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా కుల గణన,

    • రిజర్వేషన్లు, రైతుల పంటలకు మద్దతుధర, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు

    • జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా అక్రమ చొరబాట్లు, రిజర్వేషన్లు,

    • జేఎంఎం అవినీతి, రైతుల పంటలకు మద్దతుధర, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు

  • 2024-11-23T07:58:40+05:30

    • గెలిచేదెవరు..

    • మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు

    • జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు

    • 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక

    • మహారాష్ట్రలో 30 ఏళ్ల తర్వాత అత్యధిక శాతం పోలింగ్ నమోదు.

    • మహారాష్ట్ర లో 66 శాతం పోలింగ్ నమోదు.

    • జార్ఖండ్ 67.74 శాతం పోలింగ్ నమోదు

  • 2024-11-23T07:56:28+05:30

    జడ్జ్‌మెంట్ డే

    • ఢిల్లీ: కాసేపట్లో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

    • ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం

    • తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.

    • 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు.

    • కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత.

  • 2024-11-23T07:16:27+05:30

    మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మినిట్ టు మినిట్ మీకు అందిస్తోంది.