Maharashtra Exit polls: మహారాష్ట్ర, జార్ఖాండ్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే
ABN, Publish Date - Nov 19 , 2024 | 05:31 PM
పోలింగ్ పూర్తయిన అనంతరం వెలువడే "ఎగ్జిట్ పోల్స్''పై సహజంగానే ప్రజల్లో ఉత్సుకత ఉంటుంది. ఓటింగ్ బూత్ నుంచి నిష్క్రమించేటప్పుడు తాము ఎంచుకున్న అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి కసరత్తు జరుగుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పోల్స్ తరహాలో కూడా సాగుతాయి.
న్యూఢిల్లీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో భాగంగా 38 అసెంబ్లీ స్థానాలతో పాటు, 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరుగునుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు, అగ్రనేతల కొద్ది కాలంగా సాగిస్తున్న హోరాహోరీ ప్రచారానికి నవంబర్ 18న తెరపడింది. మరోవైపు పోలింగ్ శాతం ఏ విధంగా ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కట్టనున్నాయనే ఉత్కంఠకు తెరలేచింది.
Maharashtra Elections: 'మహా' సంగ్రామంలో అందరిదృష్టి ఆ 5 నియోజకవర్గాల పైనే
మహారాష్ట్ర, జార్ఖాండ్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (మహారాష్ట్రలో మహాయుతి), కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' బ్లాక్ (మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి) మధ్య హోరాహోరీ పోరు ఉంది. జార్ఖాండ్‌లో డెమోగ్రాఫిక్ ఛేంజ్‌ను ఎన్డీయే ప్రధాన ఎన్నికల అస్త్రంగా తీసుకుంది. మహారాష్ట్రలో 'లడ్కీ బహిన్ యోజనట సహా పలు సంక్షేమ పథకాలపై ప్రచారం సాగించింది. మరోవైపు, 'ఇండియా' కూటమి జార్ఖాండ్‌లో 'మైయ సమ్మాన్ యోజన' వంటి సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రంగా చేసుకోగా, మహారాష్ట్రలో మహాయుతి అవకతవకల పాలన కారణంగా అభివృద్ధి నిలిచిపోయిందని, ఉపాధి అవకాశాలు కోల్పోయిందని ప్రచారం సాగించింది.
ఎగ్జిట్ పోల్స్..
పోలింగ్ పూర్తయిన అనంతరం వెలువడే "ఎగ్జిట్ పోల్స్''పై సహజంగానే ప్రజల్లో ఉత్సుకత ఉంటుంది. ఓటింగ్ బూత్ నుంచి నిష్క్రమించేటప్పుడు తాము ఎంచుకున్న అభ్యర్థి గురించి తెలుసుకోవడానికి కసరత్తు జరుగుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పోల్స్ తరహాలో కూడా సాగుతాయి. అధికారిక ఫలితాలను అంచనా వేసే ప్రయత్నంలో వివిధ ఛానెల్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి.
సమయం, తేదీ..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20వ తేదీ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఒక గంట పొడిగింపు కూడా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత అరగంటకు అంటే.. 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. ఈసీఐ ఆదేశాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల సమయం ఉంటుంది. కాగా, అటు జార్ఖాండ్‌లోనూ నవంబర్ 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఒక గంట పొడిగింపు ఉంటుంది. దీంతో రెండు విడతల జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తాయి. పలు ఛానెళ్లు లైవ్ అప్‌డేట్స్ ప్రసారం చేస్తాయి.
ఇవి కూడా చదవండి...
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ల దాడి
అమెరికా పోలీసుల అదుపులో అన్మోల్ బిష్ణోయ్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 19 , 2024 | 05:32 PM