ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amit shah: మహారాష్ట్ర తదుపరి సీఎం షిండే కాదా?.. అమిత్‌షా ఏమన్నారంటే

ABN, Publish Date - Nov 10 , 2024 | 03:16 PM

భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ తమతమ మేనిఫెస్టోలను విడుదల చేశాయని, ఎన్నికల అనంతరం మూడు పార్టీలకు చెందిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి హామీల ప్రాధ్యాన్యతా క్రమాన్ని నిర్ధారిస్తుందని అమిత్‌షా తెలిపారు.

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assemblyl Elections) మహాయుతి ప్రభుత్వం తిరిగి గెలిస్తే పగ్గాలు చేపట్టే ముఖ్యమంత్రి ఎవరు? దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారంనాడిక్కడ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మహాయుతి ప్రభుత్వం పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని, ఎన్నికల అనంతరం భాగస్యామ్య పార్టీలు సమావేశమై తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.

MVA poll: మహారాష్ట్ర ఎన్నికలు.. మహా వికాస్ అఘాడి మేనిఫెస్టో ఇదే


భాగస్వా్మ్య పార్టీలైన బీజేపీ, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ తమతమ మేనిఫెస్టోలను విడుదల చేశాయని, ఎన్నికల అనంతరం మూడు పార్టీలకు చెందిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి హామీల ప్రాధ్యాన్యతా క్రమాన్ని నిర్ధారిస్తుందని అమిత్‌షా తెలిపారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేనే అని, ఎన్నికల అనంతరం మూడు పార్టీలు సమావేశమై సీఎంను నిర్ణయిస్తారని చెప్పారు. ఉద్ధవ్ థాకరే శివసేన, శరద్ పవార్ ఎన్‌సీపీ చీలిపోవడానికి కారణం వివరిస్తూ, ఏక్‌నాథ్ షిండేకు బదులుగా ఉద్ధవ్ థాకరే తన కుమారుడికి ప్రాధాన్యత నిచ్చారని, అజిత్ పవార్‌కు బదులు తన కుమార్తెకు శరద్ పవార్ ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఆ పార్టీల్లో చీలిక వచ్చిందేకానీ, బీజేపీ కారణంకాదన్నారు. అన్నారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.


రిజర్వేషన్లను బీజేపీ బలహీనపరుస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం కల్పించిందని, తాము రిజర్వేషన్లను పటిష్టం చేశామని చెప్పారు. కులాల పరంగా దేశాన్ని విడకొట్టేందుకే కాంగ్రెస్ కుల రాజకీయాలు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. ఎంవీఏ హయాంలో పెట్టుబడుల విషయంలో మహారాష్ట్ర వెనుకబడిందనే వాదనను అమిత్‌షా తోసిపుచ్చారు. ఎంవీఏ హయాంలో గత రెండేళ్లలో ఎఫ్‌డీఐల పరంగా రాష్ట్రం 4వ స్థానంలో ఉందని, అత్యధిక ఎఫ్‌డీఐలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు.


ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సారీ నాన్నా అమ్మను చంపేశా

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

For More National And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 03:24 PM