Assembly Election Results: రేపు వెలువడనున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ABN, Publish Date - Oct 07 , 2024 | 08:06 PM
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సర్వం సిద్దం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సీఈసీ ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 07: జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సర్వం సిద్దం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సీఈసీ ఏర్పాటు చేసింది. అందుకోసం భారీగా బలగాలను మోహరించింది. రేపు ఉదయం 8.00 గంటలకు ఇరు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Dasara 2024: దసరా వేళ.. సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి
భద్రత చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులతోపాటు భద్రతా దళాలను మోహరించినట్లు తెలిపింది. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించింది. తొలుత 7.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని స్పష్టం చేసింది. అనంతరం ఈవీఎంలో నమోదైన ఓట్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఈసీ పేర్కొంది.
Also Read: Dasara Navaratri 2024: ఆరో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మ వారు
జమ్మూ కశ్మీర్‌లో...
జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా.. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతంపైగా ఓటింగ్ నమోదయింది. దాదాపు దశాబ్దం తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదీకూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.
Also Read: Batti Vikramarka: ప్రజా అజెండా తప్పా.. వ్యక్తిగత అజెండా లేదు
ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఓటర్ ఏ పార్టీకి పట్టం కడతాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలున్నాయని స్పష్టం చేశాయి. లేకుంటే రాష్ట్రంలో హాంగ్ ప్రభుత్వం కొలువు తీరే అవకాశముందని పేర్కొంది.
Also Read: Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు
హర్యానాలో..
ఇక హర్యానాలో సైతం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో అంటే.. అక్టోబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. గతంలో హర్యానాలో వరుసగా జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. అయితే ఈ సారి ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి.
Also Read: మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఇవి తీసుకోకండి..
ఓ వేళ.. అదే జరిగితే మాత్రం రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని బీజేపీ అగ్రనేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి హర్యానా ఓటరు ఎవరి పట్టం కట్టేది.. బీజేపీకా? లేకుంటే కాంగ్రెస్ పార్టీకా? అనేది మంగళవారం సాయంత్రం నాటికి తెలిపోనుందన్నది సుస్పష్టం.
ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశముందని సమాచారం.
For National News and Telugu News...
Updated Date - Oct 07 , 2024 | 08:53 PM