Share News

అదానీపై అదే రగడ

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:26 AM

పార్లమెంట్‌ సమావేశాలు అయిదో రోజు కూడా ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ప్రతిరోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి.

అదానీపై అదే రగడ

న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ సమావేశాలు అయిదో రోజు కూడా ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ప్రతిరోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి. దర్యాప్తునకు జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండు చేశాయి. మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండపై చర్చించాలని నినాదాలు చేయడంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.


అదే సమయంలో రాజ్యసభ కూడా విపక్ష సభ్యుల నినాదాలతో అట్టుడుకుంది. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభను డిసెంబర్‌ 2వ తేదీ (సోమవారానికి)కి వాయిదా వేశారు. అటు లోక్‌సభ మళ్లీ ప్రారంభమైనప్పటికీ ఇదే పరిస్థితి కనిపించడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

Updated Date - Nov 30 , 2024 | 05:26 AM