PM Modi: ఉక్రెయిన్ పర్యటనకు మోదీ రెడీ..ఎప్పుడంటే..?
ABN , Publish Date - Jul 27 , 2024 | 05:57 PM
ఉక్రెయిన్‌పై రష్యా 2022లో సైనిక చర్యకు దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా 2022లో సైనిక చర్యకు దిగిన తర్వాత తొలిసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉక్రెయిన్ (Ukraine)లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల ఆరంభంలో మోదీ రష్యాలో రెండు రోజులు పర్యటించారు. ఉక్రెయిన్ జాతీయ దీనోత్సవం (National day) ఆగస్టు 24న జరుగనున్నందున దాదాపు ఆ సమయానికి కాస్త అటూఇటూగా కీవ్‌లో మోదీ పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్‌స్కీ ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ-7 శిఖరాగ సదస్సులో భాగంగా భేటీ అయ్యారు. దీనికి ముందు గత ఏడాది మేలో హీరోషిమాలో జరిగిన జీ-7 సమ్మట్‌లోనూ ఉభయులూ కలుసుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతియుత పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గమే పరిష్కారమని భారత్ మొదట్నించీ స్పష్టంగా చెబుతూ వస్తోంది. ఈ దిశగా అవసరమైన సహకారం అదించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి జెలెన్‌స్కీ ఫోన్ చేసి అభినందించారు. తమ దేశంలో పర్యటించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఆగస్టు ద్వితీయార్ధంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి.
NITI Aayog meeting: మమత మైక్ కట్ చేయడంలో నిజం ఎంత? ఎవరేం చెప్పారు?
కాగా, ఉక్రెయిన్ పర్యటన తర్వాత పోలాండ్‌లో కూడా మోదీ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల తర్వాత పోలాండ్‌లో ఒక భారత ప్రధాని పర్యటించనుండటం కూదే మొదటిసారి అవుతుంది.
Read more National News and Telugu News