Share News

Rahul Gandhi: ధరలు, నిరుద్యోగమే ప్రధాన ఎజెండా

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:42 AM

పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, సా మాజిక న్యాయం ప్రధాన అంశాలుగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర

Rahul Gandhi: ధరలు, నిరుద్యోగమే ప్రధాన ఎజెండా

- నేడు ప్రారంభం కానున్న రాహుల్‌ న్యాయ్‌యాత్ర

ఇంఫాల్‌, జనవరి 13: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, సా మాజిక న్యాయం ప్రధాన అంశాలుగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర మణిపూర్‌ రాష్ట్రం నుంచి ఆదివారం ప్రారంభం కానుంది. 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా సాగే ఈ న్యాయ్‌యాత్ర భారత్‌ జోడో యాత్రలాగే పార్టీకి పేరు తెస్తుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యల మీద పార్లమెంటులో మాట్లాడనివ్వనందున.. ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం దక్కాలని కోరుతూ న్యాయ్‌యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ ప్రధానంగా చేపడుతున్నందున.. కాంగ్రెస్‌ నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను ఈ యాత్ర ద్వారా వెలుగులోకి తేవాలని భావిస్తోంది. అసలైన సమస్యలపై ప్రజల దృష్టి పడకుండా భావోద్వేగ అంశాలను రాజకీయాలకు వాడుకుంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆయన ‘ఎక్స్‌’లో ఒక పోస్టు చేస్తూ... మన కలల భారతం ఇదేనా...? జీవన ప్రమాణాలు ముఖ్యమా... భావోద్వేగ అంశాలా...? ఆందోళనల్లో నినాదాలివ్వడమా... ఉద్యోగాలా? ప్రేమ... ద్వేషమా? ఏది ముఖ్యం అనేదానిపై యువత ఆలోచించాలన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 10:42 AM