Rains: ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
ABN , Publish Date - Oct 10 , 2024 | 01:22 PM
లక్షద్వీప్, ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
చెన్నై: లక్షద్వీప్, ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. చెన్నై, తిరుప్పూర్, తంజావూరు, కోయంబత్తూర్, రాణిపేట(Chennai, Tiruppur, Thanjavur, Coimbatore, Ranipet) తదితర జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది.
ఈ వార్తను కూడా చదవండి: Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..
అలాగే, ఐదు జిల్లాలకు ఈ నెల 12వ తేది ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తిరునల్వేలి, కన్నియాకుమారి, తూత్తుకుడి, రామనాధపురం, తెన్‌కాశి తదితర జిల్లాల్లో ఈ నెల 12వ తేది భారీ నుంచి అతి భారీవర్షాలు కురువనున్నాయి. 13వ తేది తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురై, అరియలూరు, పెరంబలూరు తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది.
..............................................................
ఈ వార్తను కూడా చదవండి:
.............................................................
Chennai: ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
- రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
చెన్నై: దిండుగల్(Dindugal) జిల్లా ఉడుమలై సమీపంలో జీపు, టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పళనికి చెందిన ఓ కుటుంబం జీపులో కినత్తుకడవులోని బంధువు అంత్యక్రియల్లో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. కరుపుస్వామి పుదూర్ ప్రాంతంలో వస్తున్న జీపు ఎదురుగా వచ్చిన టెంపో ట్రావెలర్‌ను ఢీకొంది.
ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న త్యాగరాజన్ (45), ఆయన భార్య ప్రీతి (40), కుమారుడు జయప్రియన్ (11), త్యాగరాజన్ తల్లి మనోన్మణి (65) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. తాగ్యరాజన్ తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడడంతో, చుట్టుపక్కల వారు వారికి రక్షించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే, టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న వారిలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదికూడా చదవండి: Revanth Reddy: దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది..
ఇదికూడా చదవండి: KTR: మూసీ పేరిట లక్ష కోట్ల దోపిడీకి యత్నం
ఇదికూడా చదవండి: Ponnam: సున్నాకే పరిమితమైనా బుద్ధి మారలేదు
ఇదికూడా చదవండి: Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్
Read Latest Telangana News and National News