Kavitha: తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి
ABN, Publish Date - Apr 05 , 2024 | 05:49 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. వచ్చే వారం సీబీఐ అధికారులు జైలులో కవితను ప్రశ్నిస్తారు.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kavitha) విచారించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. వచ్చే వారం సీబీఐ అధికారులు జైలులో కవితను ప్రశ్నిస్తారు. జైలు లోనికి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకొచ్చేందుకు సీబీఐ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సీబీఐ సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి:
Maharashtra: బీజేపీ నేత సంచలనం: థాకరే అవినీతి బయట పెట్టాలని ఆదేశం
Rain: ఎండల నుంచి ఉపశమనం.. తెలంగాణలో 3 రోజులు వర్షాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 05 , 2024 | 06:40 PM