ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెబీ దర్యాప్తు!

ABN, Publish Date - Nov 23 , 2024 | 05:40 AM

అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైన నేపథ్యంలో భారత క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ సైతం ఈ విషయంపై సూత్రప్రాయంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

న్యూఢిల్లీ: అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైన నేపథ్యంలో భారత క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ సైతం ఈ విషయంపై సూత్రప్రాయంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. షేర్ల ధరలను ప్రభావితం చేయగలిగే సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధనలను అదానీ గ్రూప్‌ ఉల్లంఘించిందా..? అన్న కోణంలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లంచం ఆరోపణలపై అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ దర్యాప్తు సమాచారాన్ని సమగ్రంగా వెల్లడించడంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ విఫలమైందా అని వాకబు చేయాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీ అధికారులను సెబీ కోరిందని వారు వెల్లడించారు. కాగా, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు శుక్రవారం అదానీ కంపెనీలను ఈ విషయంపై వివరణ కోరాయి. అలాగే, అదానీ గ్రూప్‌తో ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ, ఇంధన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా ప్రకటించింది. ఈ విషయంపైనా అదానీ గ్రూప్‌ను ఎక్స్ఛేంజీలు స్పష్టత కోరాయి. ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చే ప్రక్రియకు రెండు వారాలు పట్టవచ్చని.. స్టాక్‌ ఎక్స్ఛేంజీ అధికారుల విచారణలో తేలే విషయాల ఆధారంగా అదానీ గ్రూప్‌పై అధికారిక దర్యాప్తును ప్రారంభించాలా..? వద్దా..? అనే విషయంపై సెబీ నిర్ణయం తీసుకోనుందన్నారు.

ప్రశ్నార్థకంలో అదానీ గ్రూప్‌ నైతికత

అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ నైతిక పాలన ప్రమాణాలపై మళ్లీ ప్రశ్నలు తలెత్తవచ్చని, గ్రూప్‌ ప్రతిష్ఠ దెబ్బతీయనుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్‌ అంటోంది. మున్ముందు అదానీ కంపెనీలకు దేశీయంగా, అంతర్జాతీయంగా నిధుల సమీకరణ కష్టతరం కావచ్చని, ఇప్పటికే రుణాలిచ్చినవారి నుంచీ ఆందోళనలు వ్యక్తమవుతాయా అని పరిశీలించనున్నట్లు తన నోట్‌లో పేర్కొంది. తాజా వివాదం నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 60 కోట్ల డాలర్ల బాండ్ల జారీని సైతం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు, అమెరికాలో నమోదైన అభియోగాలకు సంబంధించి అదానీ గ్రూప్‌పై దర్యాప్తు ప్రారంభించేందుకు ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలను పరిగణనలోకి తీసుకోమని మార్కెట్‌ పోటీ నియంత్రణ మండలి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చైర్‌పర్సన్‌ రవనీత్‌ కౌర్‌ స్పష్టం చేశారు. కాగా, అమెరికాలో నమోదైన కేసులను అదానీ జరిమానాలు చెల్లించి సెటిల్‌మెంట్‌ చేసుకునే అవకాశాలున్నాయి.

Updated Date - Nov 23 , 2024 | 05:40 AM