Delhi: ముస్లింలు ఎక్కువుంటే పాకిస్థానా?
ABN, Publish Date - Sep 21 , 2024 | 05:24 AM
ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలను శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై నివేదిక సమర్పించాలని ఆ హైకోర్టును ఆదేశించింది.
మీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి
కర్ణాటక హైకోర్టు జడ్జికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలను శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై నివేదిక సమర్పించాలని ఆ హైకోర్టును ఆదేశించింది. యజమాని-అద్దెదారు మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపే సమయంలో బెంగళూరులోని ముస్లిం మెజార్టీ ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా అభివర్ణించారు. మరో సందర్భంలో ఆ కేసును వాదించిన మహిళా న్యాయవాదిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎదుటి పక్షం గురించి ఆమెకు చాలా తెలిసినట్టుంది.
ఎంతగా అంటే వారి లోదుస్తుల రంగు కూడా చెప్పేటంతగా...’’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించారు. దీనిపై ఆయన ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం కూడా విచారణ జరిపింది. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై తక్షణమే మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Updated Date - Sep 21 , 2024 | 05:24 AM