దేశంలోనే అతిపొడవైన రైలు సొరంగం
ABN , Publish Date - Feb 21 , 2024 | 03:43 AM
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గంలో దేశంలోనే అతిపొడవైన రవాణా టన్నెల్‌కు మోదీ శ్రీకారం చుట్టారు. ఖారీ-సుంబర్ సెక్షన్ నడుమ 12.77 కిలోమీటర్ల పొడవున ఈ టన్నెల్ ఉంది,
దేశంలోనే పొడవైన రైలు సొరంగం ప్రారంభం
ఉధంపూర్-బారాముల్లా మార్గంలో
12.77 కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గంలో దేశంలోనే అతిపొడవైన రవాణా టన్నెల్‌కు మోదీ శ్రీకారం చుట్టారు. ఖారీ-సుంబర్ సెక్షన్ నడుమ 12.77 కిలోమీటర్ల పొడవున ఈ టన్నెల్ ఉంది, దీనిని టీ-50గా పిలుస్తారు. బనిహాల్-ఖారీ-సుంబర్-సంగల్‌దాన్ కొత్త రైల్వే లైన్‌ను(48.1 కిలోమీటర్లు), శ్రీనగర్ నుంచి సంగల్‌దాన్ వరకు, సంగల్‌దాన్ నుంచి శ్రీనగర్ వరకు నడిచే రెండు విద్యుత్ రైళ్లను కూడా ప్రధాని ప్రా రంభించారు. బారాముల్లా-బనిహాల్ మధ్య మొత్తం 8 విద్యుత్ రైళ్లు నడవనున్నాయి. జమ్మూకశ్మీరులో పెద్దఎత్తున రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించడంపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. రైలే శాఖ, ప్రధాని మోదీ చేపట్టిన అతి గొప్ప చర్యగా అభివర్ణించారు.