LokSabha Elections: నాటి యూపీఏ దారిలో... నేటి దీదీ ప్రభుత్వం
ABN , Publish Date - May 03 , 2024 | 07:18 PM
పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వం స్కామ్‌ల్లో రికార్డు సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ ప్రభుత్వంలో వివిధ రంగాల్లో స్కామ్‌లు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొల్‌కతా, మే 03: పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వం స్కామ్‌ల్లో రికార్డు సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ ప్రభుత్వంలో వివిధ రంగాల్లో స్కామ్‌లు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంజి స్కామ్, బొగ్గు అక్రమ రవాణా స్కామ్, రేషన్ పంపిణీ స్కామ్, ఉద్యోగ నియామకాల స్కామ్‌లు ఈ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు.
LokSabha Elections: మొహువా మోయిత్రితో కలిసి స్టెపులు వేసిన దీదీ
2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, చివరకు రక్షణ రంగంలో సైతం స్కామ్ జరిగిందని గుర్తు చేశారు. నాటి యూపీఏ ప్రభుత్వ బాటలోనే ఈ మమతా బెనర్జి పయనిస్తుందని ఆరోపించారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల నివాసాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు జరిపిన దాడుల్లో కోట్లాది రూపాయిల నగదు పట్టుబడిన విషయాన్ని ఈ సందర్బంగా మోదీ గుర్తు చేశారు.
అయితే ఈ స్కామ్‌లపై విచారణ జరపాలని కోల్‌కతా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం.. కేంద్రం దర్యాప్తు సంస్థ అధికారులపై ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ప్రజలకు ఈ సందర్భంగా మోదీ విజ్జప్తి చేశారు.
LokSabha Elections: మళ్లీ నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ.. స్పందించిన అన్నీ రాజా
అయితే ఇండియా కుటమిలోని పార్టీల్లోని నేతలకు దూర దృష్టి లేదని విమర్శించారు. మూడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కొత్త విద్య విధానాన్నే ప్రవేశ పెట్టలేదని చెప్పారు. కానీ తమ 10 ఏళ్ల పాలనలో దేశంలో అధునిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. శుక్రవారం బిర్భం జిల్లాలోని అమోద్ పూర్‌లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు దేబంత్ భట్టాచార్య, ప్రియా షాకు మద్దతుగా మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Read Latest National News And Telugu News