Share News

Veerappan: లోక్ సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె.. ఆ పార్టీ నుంచే పోటీ..

ABN , Publish Date - Mar 24 , 2024 | 04:49 PM

గంధపు చెక్కల స్మగ్లర్‌, బందిపోటు వీరప్పన్‌ కుమార్తె లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన విద్యారాణి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నామ్ తమిళర్ కట్చి టికెట్‌పై పోటీ చేయనున్నట్లు తెలిపారు.

Veerappan: లోక్ సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె.. ఆ పార్టీ నుంచే పోటీ..

గంధపు చెక్కల స్మగ్లర్‌, బందిపోటు వీరప్పన్‌ కుమార్తె లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన విద్యారాణి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నామ్ తమిళర్ కట్చి టికెట్‌పై పోటీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని తన తండ్రి భావించారని కానీ ఆయన ఎంచుకున్న మార్గం సరైనది కాదని విద్యారాణి ( Vidyarani ) అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వివరించారు. వృత్తి రీత్యా న్యాయవాదిగా పని చేస్తున్న విద్యారాణి గిరిజనులు, దళితుల హక్కుల కోసం పోరాడుతూ ఉద్యమకారిణిగా పేరు తెచ్చుకున్నారు.

విద్యా రాణి జూలై 2020లో బీజేపీలో చేరారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఈ క్రమంలో నటుడు-దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని ఎన్‌టీకే లో చేరేందుకు బీజేపీకి గుడ్ బై చెప్పారు. విద్యా రాణి మూడో తరగతి చదువుతున్న సమయంలో తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్‌ గ్రామంలో తాతయ్య ఇంట్లో తన తండ్రి వీరప్పన్ ను కలిశారు. తాను వీరప్పన్ ను కలవడం అదే మొదటి, చివరి సారి అని విద్యారాణి గుర్తు చేసుకున్నారు.


సీమాన్ విధానాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. 2016లో జరిగిన తొలి ఎన్నికల్లో కేవలం 1.1 శాతం ఓట్ల వాటా నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 4 శాతం ఓట్లను సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 6.7 శాతానికి పెరిగింది. ఓట్ల శాతం పరంగా మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్టోబరు 18, 2004న తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలో ఎన్‌కౌంటర్‌లో హతమైన వీరప్పన్ దేశ వ్యాప్తంగా సుపరిచితుడే.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 24 , 2024 | 04:50 PM