Beauty Tips: పెళ్లి రోజు అందంగా కనిపించాలనుకుంటున్నారా? వధువరుల కోసం స్పెషల్ బ్యూటీ టిప్స్..!
ABN, Publish Date - Feb 05 , 2024 | 08:22 PM
Beauty Tips: పెళ్లి అనేది ప్రతి యువతీ, యువకుడి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమైన, మధురమైన క్షణం. అందుకే పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి, అబ్బాయి తమ పెళ్లి వేడుకను ఘనంగా, మధుర జ్ఞాపకంగా నిలిచేలా ప్లాన్స్ చేసుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో భాగంగా డెకరేషన్ మొదలు..
Beauty Tips: పెళ్లి అనేది ప్రతి యువతీ, యువకుడి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమైన, మధురమైన క్షణం. అందుకే పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి, అబ్బాయి తమ పెళ్లి వేడుకను ఘనంగా, మధుర జ్ఞాపకంగా నిలిచేలా ప్లాన్స్ చేసుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో భాగంగా డెకరేషన్ మొదలు.. వధు వరులు వేసుకునే డ్రెస్, అలంకరణ, ప్రతీది చాలా ప్రత్యేకంగా సెట్ చేసుకుంటారు. ప్రస్తుతం ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా బాజా భజంత్రీలు మోగనున్నాయి. కొత్త జంటలు సందడి చేయనున్నారు. ఇప్పటికే ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని.. షాపింగ్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. అదే సమయంలో పెళ్లిలో అందంగా, ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లకు, బ్యూటీ పార్లర్లకు వెళ్లేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే పెళ్లిలో మరింత అట్రాక్టీవ్‌గా, అందంగా, స్పెషల్ లుక్‌ల కనిపించాలంటే.. ఆరోగ్యం, చర్మం, ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ చూపడం అవసరం. పెళ్లి సమయంలో ముఖం డల్‌గా ఉన్నా.. ఫోటో, వీడియోలో సరిగా కనిపించకపోయినా.. ఎంత ఖరీదైన డ్రెస్ వేసినా.. మేకప్ వేసినా వేస్ట్ అవుతుంది. అందుకే.. పెళ్లి సమయంలో వధు వరులు అందంగా, ఫిట్‌గా, అట్రాక్టీవ్‌గా ఉండేందుకు ఏం చేయాలో సూచిస్తూ సూపర్ టిప్స్ తీసుకువచ్చాం.
పెళ్లి సమయంలో వధూవరులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
బాదం: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు, అబ్బాయిలు తమ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బాదం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవాలి. బాదం పప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది.
అవకాడో: అవోకాడో చర్మ సంరక్షణకు అద్భుతంగా పని చేస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తాయి. వివాహ సమయంలో అవకాడో తీసుకుంటే మేలు జరుగుతుంది. దీన్ని సలాడ్, స్మూతీ, జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు.
బెర్రీలు: రాస్ బెర్రీలు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ కూడా చర్మానికి పోషణనిచ్చే ఆహారాలు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. పెళ్లి సమయంలో మీ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.
సాల్మన్ ఫిష్: ఈ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. పెళ్లి చేసుకోబోయే యువతీ యువకులు భోజనంలో సాల్మన్ చేపలను తింటే చర్మం మెరిసిపోతుంది.
పచ్చి కూరగాయలు, ఆకు కూరలు: క్యాబేజీ, బచ్చలికూరలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి, మృదువుగా, యవ్వనంగా ఉండే చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెళ్లి రోజున సహజమైన మెరుపును పొందవచ్చు.
పసుపు: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు.. అందాన్ని పెంచడంలో, చర్మ సంరక్షణలో అద్భుతంగా పని చేస్తుంది. పాలలో చిటికెడు పసుపు కలుపి పడుకునేటప్పుడు తాగితే చర్మం మెరుస్తుంది.
గమనిక: బ్యూటీషియన్స్ అందించిన సమాచారం.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీనిని ఇవ్వడం జరిగింది. పైన పేర్కొన్న విధానాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఈ సలహాలు, సూచనలు పాటించే ముందు నిపుణుల అభిప్రాయం, సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Updated Date - Feb 05 , 2024 | 08:30 PM