ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TEchnology : ఏఐ ఓవర్‌వ్యూస్‌ 15 శాతానికే జవాబు!

ABN, Publish Date - Jun 08 , 2024 | 05:37 AM

గూగుల్‌కు చెందిన ఏఐ ఓవర్‌వ్యూస్‌ - వివిధ ప్రశ్నలకు స్పందించడంలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిగా తప్పు లేదంటే ఉపకరించని రీతిలో సమాధానాలను ఇస్తోంది. ప్రస్తుతం దాన్ని సరిదిద్దే పనుల్లో గూగుల్‌ ఉంది.

గూగుల్‌కు చెందిన ఏఐ ఓవర్‌వ్యూస్‌ - వివిధ ప్రశ్నలకు స్పందించడంలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిగా తప్పు లేదంటే ఉపకరించని రీతిలో సమాధానాలను ఇస్తోంది. ప్రస్తుతం దాన్ని సరిదిద్దే పనుల్లో గూగుల్‌ ఉంది. అడిగిన దానిలో పదిహేను శాతానికే సమాధానం ఇస్తోందని సరికొత్త నివేదకలో వెల్లడైంది. ఎస్‌ఈఓ వేదిక ‘బ్రైట్‌ఎడ్జ్‌’ ఈ ధోరణిని ఏప్రిల్‌ మధ్య నుంచే కనుగొంది.

సమాధానం ముక్కలు ముక్కలుగా కనిపిస్తోందని కూడా తెలిపింది. ఏఐ ఓవర్‌వ్యూస్‌ అంటే సెర్చ్‌ జనరేటెడ్‌ ఎక్స్‌పీరియెన్స్‌(ఎస్‌జీఈ) ఇచ్చే సమాధానం విజిబిలిటీ 84 శాతానికి పరిమితమై ఉండేది. అమెరికాలోని యూజర్లు అందరికీ మే నెల మొదట్లో ఏఐ ఓవర్‌వ్యూస్‌ని అందించారు. అయితే కొంతమంది యూజర్లు అది చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ఎక్స్‌లో స్పందించారు.

సమాధానాలకు సంబంధించి స్ర్కీన్‌షాట్లను పోస్ట్‌ చేశారు. ఈ ఫిర్యాదులకు గూగుల్‌ వెంటనే స్పందించింది. సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నట్టు కూడా తెలిపింది. తమ అల్గోరిథమ్స్‌ను మెరుగుపర్చుకోవడం లేదా తమ పాలసీకి విరుద్ధంగా ఉన్న స్పందనలను ప్రత్యేక ప్రక్రియల ద్వారా తొలగించడం చేస్తామని కూడా ప్రకటించింది. వెబ్‌ ద్వారా అడిగిన సందేహాలకు స్పందించకుండా గూగుల్‌ మాన్యువల్‌గా టర్నింగ్‌ ఆఫ్‌ చేస్తోందంటూ ఈలోపు మరో నివేదిక బైటపడటం గమనార్హం.

Updated Date - Jun 08 , 2024 | 11:42 AM

Advertising
Advertising