Mental and Physical Health : పిల్లల్లో పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే ఇలా ట్రై చేస్తే సరి..!
ABN, Publish Date - Apr 01 , 2024 | 04:03 PM
దగ్గరలో పరీక్షలు ఉన్నాయి అన్నప్పుడు కాస్త విశ్రాంతి కూడా తీసుకోకుండా చదివేస్తూ ఉంటారు. ఇది విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. చాలా వరకూ నీరసాన్ని, ఉత్తేజం లేకుండా చేసేది ఇదే.
పిల్లల్లో (kids) చదువుల ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఈ పరీక్షల కాలంలో మరీ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. పరీక్షలు, ర్యాంకులు, ఒత్తిడితో సతమతం అవుతుంటారు. ఇది సరిగ్గా పరీక్షలు మొదలవుతున్న సమయంలో మరీ పెరుగుతుంది. తక్కువ మార్కులు వస్తాయని, అసలు పరీక్షలో పాస్ కామని ఇలా రకరకాలుగా ఒత్తిడితో ఉంటారు పిల్లులు. దీని నుంచి బయటపడాలంటే చదువులో చురుగ్గా ఉంటేనే సరిపోదు. చిన్న చిన్న చిట్కాలతో దీనికి చెక్ పెట్టాలి. అవేమిటంటే..
పరీక్షలు ముందుండగా..
ఇక దగ్గరలో పరీక్షలు ఉన్నాయి అన్నప్పుడు కాస్త విశ్రాంతి కూడా తీసుకోకుండా చదివేస్తూ ఉంటారు. ఇది విపరీతమైన ఒత్తిడిని (stress)పెంచుతుంది. చాలా వరకూ నీరసాన్ని, ఉత్తేజం లేకుండా చేసేది ఇదే. అందుకోసం టైం ప్రకారం సెడ్యూల్ వేసుకున్నప్పుడు అందులో విశ్రాంతికి కూడా షెడ్యూల్ ఉండేలా చూసుకోవాలి. చదువుతో వచ్చిన ఒత్తిడి నుంచి కాస్తన్నా రిలీఫ్ వస్తుంది.
ఇవి కూడా చదవండి: అధిక బరువు తగ్గించే శాకాహారం.. రోజూ తీసుకుంటే .!
ఈ పండు రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందట...!
వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..
ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!
మెదడుకు విశ్రాంతి..
చదివి చదివి మరీ అలసట వస్తున్నప్పుడు మెదడుకు విశ్రాంతి అవసరం. దీనికోసం ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. మరీ ఎక్కువ చదివే పిల్లలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గడంతో పాటు, అలసట కూడా దూరం అవుతుంది.
ఆహారం..
పోషకాహాన్ని తగిన విధంగా తీసుకుంటూ ఉండాలి. పోషకాలతో నిండిన ఆహారాన్ని ఎంపిక చేసుకుని దానిని షెడ్యూల్ ప్రకారం తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరానికి శక్తితో పాటు, మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దీనికోసం రోజూ పండు, కూరగాయలు, వాల్ నట్స్, బాదం, పిస్తా వంటి వాటిని తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ ట్రిప్స్ ట్రై చేయండి..!
సరిపడా నిద్ర
నిద్ర పిల్లలకు చాలా అవసరం. ఇది పెరిగే వయసుకు అవసరమైన శక్తిని ఇస్తుంది. కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర పిల్లలకు అవసరం. చదివే వన్నీ గుర్తు ఉండాలన్నా, రోజులో చురుగ్గా ఉండాలన్నా కూడా నిద్ర తప్పనిసరి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 04:04 PM