Children : పిల్లలు తినడంలేదా? ఇలా చేసి చూడండి.. ఆకలి చక్కగా పెరుగుతుంది..!
ABN, Publish Date - Mar 30 , 2024 | 12:59 PM
ఏదైనా బయటి తిండి తినాలంటే మారాం ఎక్కువగా చేస్తుంటారు. తినే పదార్థాలకు రూపాన్ని, రంగుని బట్టి వారి ఎంపిక ఉంటుంది. కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు వాటిని ఎంచుకుంటూ ఉంటారు. ఇది ఆకలిని మందగించేలా చేస్తుంది.
రోజంతా చిరుతిళ్ళు తినేసి అన్నం సంగతికి వచ్చే సరికి ఆకలి లేదంటూ దాటేసే పిల్లలు కొందరైతే.. అసలు తినేదే తక్కువై, ఆకలి మందగించే పిల్లలు మరికొందరు. పిల్లలు అన్నం తికపోవడానికి పెద్దగా కారణాలు కనిపించవు. ఇది సాధారణ సమస్యే.. కానీ పిల్లలు ఎందుకు తినడం లేదు అనేది తెలుసుకునేందుకు వైద్యుల సలహాల కోసం తరుచుగా వెళుతుంటారు. పిల్లలు ఎందుకు తినడం లేదు అనేది రోజురోజుకూ పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. దీనికి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే..
మారాం ఎక్కువగా ఉంటుంది.
1. ఏదైనా బయటి తిండి తినాలంటే మారాం ఎక్కువగా చేస్తుంటారు. తినే పదార్థాలకు రూపాన్ని, రంగుని బట్టి వారి ఎంపిక ఉంటుంది. కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు వాటిని ఎంచుకుంటూ ఉంటారు. ఇక బిస్కెట్లు, చాక్లెట్లు తినే సంగతికి వస్తే మరీ విపరీతమైన మారాం ఉంటుంది.
2. పిల్లలు ఇలా చేయడం వల్ల ఎదుగుదలకు కావాల్సిన పోషకాహారం అందదు. దీంతో బలహీనంగా మారిపోతారు. అలాంటి పిల్లల్లో ఆహారం పెంచేలా చేయడం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
3. పిల్లలను చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి.
ఇవి కూడా చదంవండి:
వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!
పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!
కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!
ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..
ఆకలి పెరగాలంటే..
1. వీటికి బదులుగా తాజా పండ్ల రసాలను తాగించాలి. ఫ్రూట్ జ్యూస్ ఇష్టపడని పిల్లలకు ఆపిల్, బనానా, జామ, సపోటా పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇస్తే ఇష్టంగా తింటారు.
2. వాల్ నట్స్, డ్రైఫ్రూట్స్, కోడిగుడ్లు, వెన్న రాసిన చపాతీలు, బాదం, నువ్వులతో చేసిన ఆహార పదార్ధాలు పిల్లలకు ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది.
ఇలా చేస్తే చాలు ఇంట్లో చీమలు దెబ్బకు కనిపించవ్..!!
3. ముందుగా పావు కిలో బియ్యం, 20 గ్రాముల శొంఠి, రెండు గ్రాముల మిరియాలను గ్రైండ్ చేసి నేతితో కలిపి తినిపించాలి. దీని వల్ల పిల్లలకు ఆకలి పెరుగుతుంది.
4. ఇలా చేసిన ముద్దలను ప్రతి రోజూ పిల్లలకు తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.
ఆకలి మందగించిన పిల్లలకు అరటి పండును బాగా గుజ్జుగా చేసి తినిపించాలి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 12:59 PM