Share News

weight loss : ఈ డైట్ బరువు తగ్గడానికి సరైనదేనా.. ఓసారి ట్రై చేస్తే సరి..!

ABN , Publish Date - May 03 , 2024 | 03:05 PM

హార్మోన్ల సమతుల్యత, కణజాల మరమ్మత్తు మొత్తం ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లలో ఆహారం తక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలలో లోపానికి దారి తీస్తుంది.

weight loss : ఈ డైట్ బరువు తగ్గడానికి సరైనదేనా.. ఓసారి ట్రై చేస్తే సరి..!
weight loss

ఇప్పటి రోజుల్లో ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికీ శ్రద్ధ కాస్త ఎక్కువగానే పెరిగింది.. మరీ ఒళ్ళుతో ఉండటం, ఊబకాయం వంటి సమస్యలను ఆరోగ్యకరమైన ఆహారంతో బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. ప్రచుర్యంలో ఉన్న చాలా డైట్ ఫ్లాన్స్‌కి మరో కొత్త పద్దతి వచ్చి చేరింది. ఇది ఇంతక మునుపు ఉన్న సమస్యే అయినా దీనిని పాటించడం కారణంగా బరువును అతి సులువుగా తగ్గించుకోవచ్చు. అసలు ఆ డైట్ ఫ్లాన్ సంగతేంటంటే..

మెరుగైన ఆరోగ్యం కోసం బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కొవ్వు పదార్థాలు, మొక్కల ఆధారిత ఆహారపదార్థాలపై దృష్టి పెట్టాలి. ఇవి తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే లీన్ బాడీ మాస్, అధిక శక్తి స్థాయిలు అందుతాయి.ఇక 80/10/10 డైట్ 80% కేలరీలు, కార్బోహైడ్రేట్లతో ముడిపడి ఉంటుంది. ఇవి పండ్లు, కూరగాయల నుండి అందుతాయి. ప్రోటీన్ల నుంచి 10శాతం, కొవ్వుల నుంచి 10 శాతం ఆ మొత్తం ఆహారం కూడా ప్రాసెస్ చేయనిదై ఉంటుంది.

అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ప్రధానంగా పండ్లనుంచి, తీసుకోవాలి. ఇందులోని ప్రోటీన్లు, కొవ్వులు అధిక నిష్పత్తులను కలిగి ఉంటుంది. 80/10/10 డైట్ కార్బోహైడ్రేట్లపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది. ప్రోటీన్లు, కొవ్వులు వంటి నెమ్మదిగా జీర్ణమయ్యే భాగాల కారణంగా శక్తిని త్వరగా అందిస్తాయి. కొవ్వును కరిగిస్తాయి.

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!


80/10/10 డైట్ వల్ల కలిగే ప్రయోజనాలివే..

1. కొవ్వును తక్కువగా తీసుకోవడం కారణంగా ఆహారంలో కొలెస్ట్రాల్ లేకపోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. బరువు తగ్గడంలో కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. రక్తంలో చక్కెర.. ఆహారంలో చక్కెరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి సహజంగా ఉంటాయి. పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది.

Summer Skin Care : వేసవిలో జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!


80/10/10 డైట్ ని పాటించడం వల్ల లోపాలు..

పోషకాహార సమతుల్యత..

హార్మోన్ల సమతుల్యత, కణజాల మరమ్మత్తు మొత్తం ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లలో ఆహారం తక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలలో లోపానికి దారి తీస్తుంది. అమైనో ఆమ్లాలు, బి12 వంటి విటమిన్లు, ఇనుము, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు అందకపోవచ్చు.

దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలు..

ఎక్కువ కాలం పాటు ఈ డైట్ పాటించడం వల్ల కండర ద్రవ్యరాశి నష్టం కలుగుతుంది. ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. పోషకాహార లోపాలు కూడా ఉంటాయి.

80/10/10 డైట్ ముఖ్యంగా..

పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు తీసుకోవాలి. దీనితో విటమిన్ బి12, విటమిన్ డి, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఈ డైట్లో శరీరాన్ని అధిక ఫైబర్ తీసుకోవడం, స్థూలపోషకాల నిష్పత్తుల మార్పులకు అనుగుణంగా శరీరాన్ని అనుమతించడం ముఖ్యం.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 03 , 2024 | 03:06 PM