డబ్బులు తీసుకుని... ఓటు కూటమికి వేయండి: పవన్

ABN, Publish Date - May 11 , 2024 | 02:01 PM

కాకినాడ: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తమ ఆస్తులు రక్షించుకోవాలంటే ప్రజలంతా కూటమికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లేదంటే జగన్‌ మళ్లీ వచ్చి మీ ఆస్తులు లాగేసుకుంటారని హెచ్చరించారు. ఎన్నికలకు ముందే జగన్‌ ఓటమితో భయపడిపోతున్నారని, అందుకే వైసీపీ ఓటుకు రూ.5 వేల వరకూ పంచుతోందని అన్నారు. ఆ డబ్బులు తీసుకుని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకే వేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం పిఠాపురం నియోకవర్గ వ్యాప్తంగా రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

డబ్బులు తీసుకుని... ఓటు కూటమికి వేయండి: పవన్ 1/5

పిఠాపురం పట్టణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ భేరీ సభకు విచ్చేసిన సందర్భంగా ప్రజలకు నమస్కరిస్తున్న దృశ్యం.

డబ్బులు తీసుకుని... ఓటు కూటమికి వేయండి: పవన్ 2/5

పిఠాపురం పట్టణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ భేరీ సభకు విచ్చేసిన సందర్భంగా ప్రజలకు నమస్కరిస్తున్న దృశ్యం.

డబ్బులు తీసుకుని... ఓటు కూటమికి వేయండి: పవన్ 3/5

పిఠాపురం పట్టణంలో నిర్వహించిన వారాహి విజయ భేరీ సభలో కూటమి నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్..

డబ్బులు తీసుకుని... ఓటు కూటమికి వేయండి: పవన్ 4/5

కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని వారాహి విజయ భేరీ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పవన్ కల్యాణ్ ..

డబ్బులు తీసుకుని... ఓటు కూటమికి వేయండి: పవన్ 5/5

పిఠాపురం పట్టణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయ భేరీ సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..

Updated at - May 11 , 2024 | 02:01 PM