Share News

Viral: స్వామి శివానంద సీక్రెట్ ఇదేనా..?

ABN , Publish Date - Jun 16 , 2024 | 01:26 PM

యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా బాగుంటారు. ఇదే విషయాన్ని వైద్యులు చెబుతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేస్తుంటారు. 60 లేదా 70 ఏళ్ల వృద్దులు యోగా చేయడం అంటే కష్టం.. మరి వందేళ్లు దాటితే అసాధ్యం.. స్వామి శివానందకు సాధ్యం అవుతోంది.

Viral: స్వామి శివానంద సీక్రెట్ ఇదేనా..?
Swami Sivananda

యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా బాగుంటారు. ఇదే విషయాన్ని వైద్యులు చెబుతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేస్తుంటారు. 60 లేదా 70 ఏళ్ల వృద్దులు యోగా చేయడం అంటే కష్టం.. మరి వందేళ్లు దాటితే అసాధ్యం.. స్వామి శివానందకు సాధ్యం అవుతోంది. 127 ఏళ్ల శివానంద ఇప్పటికీ యోగా చేస్తుంటారు. పలువురి సమక్షంలో యోగా చేసి ఆశ్చర్య పరిచారు.


యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. యోగా ప్రాధాన్యం తెలిపేందుకు ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి శివానంద ఆసనాలు వేశారు. చేతులను ముందుకు, వెనక్కి ఊపారు. తర్వాత తలను కిందకి పైకి అన్నారు. అటు, ఇటు తలను తిప్పారు. తలను చుట్టూ తిప్పారు. కాసేపటికి ముందుకు వచ్చి వంగి చేతులను కిందకి పైకి లేపారు. అలా చేయడంతో అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు.


నేపథ్యం ఇదే..

స్వామి శివానందది సేవాతత్వం. నిస్వార్థంగా సేవ చేస్తుంటారు. గత 50 ఏళ్ల నుంచి పూరిలో కుష్ఠు రోగులకు సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజు లేచిన వెంటనే యోగా చేస్తుంటారు. ఆహారంలో నూనె అస్సలు ఉండొద్దని చెబుతుంటారు. అందుకే కాబోలు అతనిని ఏ వ్యాధి దరి చేరలేదు.


అవార్డులు

స్వామి శివానంద నిస్వార్థ సేవకు గానూ 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆ సమయంలో శివానంద దర్బార్ హల్ వద్దకు చెప్పులు లేకుండా వచ్చి అవార్డును స్వీకరించారు. శివానంద వచ్చే సమయంలో అక్కడున్న వారంతా లేచి చప్పట్లు కొట్టారు. శివానంద స్వామికి 2019లో యోగా రత్న అవార్డు కూడా వచ్చింది. బసుంధర రతన్ అవార్డును కూడా స్వీకరించారు.

ఇవి కూడా చదవండి:

Viral video: బాబోయ్..! టీని ఇలాక్కూడా చేస్తారా.. ఇది టీ కాదు విషం అంటున్న నెటిజన్లు..

Viral video: వాషింగ్‌మెషిన్‌ వద్ద మీరూ ఇలాగే చేస్తున్నారా.. ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూడండి..

Updated Date - Jun 16 , 2024 | 02:05 PM