Viral News: అయ్యో దోమ.. ఎంత పని చేశావే.. పాపం ఆ రిపోర్టర్.. లైవ్ టీవీలోనే..
ABN, Publish Date - Feb 05 , 2024 | 06:46 PM
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఈగ’ సినిమాలో.. ఆ ఈగ విలన్‌ని ఎలా ముప్పుతిప్పలు పెడుతుందో అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో నాని పాత్ర ఆత్మగా మారి ఈగలో దూరినప్పటి నుంచి.. విలన్ పాత్ర పోషించిన సుదీప్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తన చేతులతో తానే కొట్టుకునేలా నానా ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో చోటు చేసుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఈగ’ సినిమాలో.. ఆ ఈగ విలన్‌ని ఎలా ముప్పుతిప్పలు పెడుతుందో అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో నాని పాత్ర ఆత్మగా మారి ఈగలో దూరినప్పటి నుంచి.. విలన్ పాత్ర పోషించిన సుదీప్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తన చేతులతో తానే కొట్టుకునేలా నానా తిప్పలు పెడుతుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో చోటు చేసుకుంది. అయితే.. ఇక్కడ ఈగ స్థానంలో దోమ ఒక రిపోర్టర్‌ను తెగ ఇబ్బంది పెట్టేసింది. ఆమెపై దోమకి ప్రతీకారం ఉందో లేదో తెలీదు కానీ.. అది చేసిన పనికి రిపోర్టర్ తనని తానే చెంపదెబ్బ కొట్టుకుంది. ఇదంతా లైవ్ టీవీలోనే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆస్ట్రేలియా టుడే షో రిపోర్టర్ అయిన ఆండ్రియా క్రోథర్స్ ఇటీవల బ్రిస్బేన్‌లో విలయతాండవం సృష్టించిన వరదల గురించి రిపోర్ట్ చేస్తోంది. ఆమె ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సమయంలో.. అనుకోకుండా ఒక దోమ వచ్చి ఆ యాంకర్ ముక్కుపై కూర్చుంది. దాంతో ఖంగుతిన్న ఆండ్రియా.. దానిని తన ముఖంపై నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తన చెంపపై తానే చాలా గట్టిగా కొట్టుకుంది. ఎంత గట్టిగా కొట్టుకుందంటే.. కళ్లు బైర్లు కమ్మి కెమెరా నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో.. స్టూడియోలో ఉన్న యాంకర్లు ఒక్కసారిగా నవ్వేశారు. దోమ వల్ల తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో.. ఆండ్రియా ఒక తెలివైన పని చేసింది. మరోసారి రిపోర్టింగ్‌కి వెళ్లినప్పుడు.. ఈసారి దోమలు కుట్టకుండా తన ముఖాన్ని దోమతెరతో కప్పుకుంది. ఆమె ఇలా కట్టుకొని రావడం మరిన్ని నవ్వులు పూయించింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు నిజంగానే హాస్యాస్పదంగానే ఉన్నాయని.. ఒక దోమ ఆండ్రియా జీవితాన్నే మార్చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి.. తన వృత్తిపరంగా కన్నా దోమ చేసిన పనికి ఆ రిపోర్టర్‌కి ఎనలేని పాపులారిటీ వచ్చిపడింది. సోషల్ మీడియాలో ఆమె గురించే నెటిజన్లు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
Updated Date - Feb 05 , 2024 | 07:40 PM