Viral: తల్లి ప్రేమ ముందు ఎంతటి శక్తైనా తలవంచాల్సిందే! ఇదిగో ప్రూఫ్!
ABN , Publish Date - Jun 03 , 2024 | 10:19 PM
తల్లి ప్రేమ ముందు ప్రకృతి కూడా తలవంచాల్సిందే. బిడ్డలకు తన ప్రాణాలు అడ్డేసే తల్లి అవసరమైతే మృత్యువును కూడా అడ్డుకోగలదు. ఆఫ్రికాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తల్లి ప్రేమ ముందు ప్రకృతి కూడా తలవంచాల్సిందే. బిడ్డలకు తన ప్రాణాలు అడ్డేసే తల్లి అవసరమైతే మృత్యువును కూడా అడ్డుకోగలదు. ఆఫ్రికాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది. ఇది చూసిన జనాలు మాతృమూర్తులకు జై కొడుతున్నారు. వందనాలు అర్పిస్తున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ జింక అడవిలో బిడ్డను కనింది. కాసేపటి తరువాత పిల్ల జింక లేచి నడవడం కూడా ప్రారంభించింది. ఇంతలో చీతా కన్ను దానిపై పడింది. పిల్ల జీవాల్ని వేటాడటం చాలా సులభం. కడుపు నిండకపోయినా తాత్కాలిక ఉపశమనమైనా దక్కుతుంది. క్రూర జంతువులు అన్నింటికీ ఈ సూత్రం తెలుసు. అందుకే పిల్ల జీవాల్ని వేటాడే అవకాశం వస్తే అస్సలు విడిచిపెట్టవు. చీతా కూడా పిల్ల జింకను ఇలాగే టార్గెట్ చేసింది (Deer saves newborn fawn from leopard risking its life).
Viral: సీఏ చదివిన యువకుడు.. బ్రేకప్ తరువాత గర్ల్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చాడుగా!
కానీ తల్లి జింక మాత్రం తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలు అడ్డేసింది. పదే పదే పిల్ల జింకపై దాడికి ప్రయత్నిస్తున్న చీతాను ధైర్యంగా ఎదుర్కొంది. దాని వెంట పడి పరిగెత్తించింది. పట్టువదలకుండా దాని వెంట పడింది. పిల్ల జింక వద్దకు వచ్చిన ప్రతిసారీ తరిమికొట్టింది. చివరకు తల్లి జింక ప్రతాపం చూసి దడుసుకున్న చీతా అక్కడి నుంచి పరారైంది. తల్లి జింక తన పిల్లతో అక్కడి నుంచి కదిలింది. ఈ వీడియో చూసిన జనాలు మురిసిపోతున్నారు. తల్లి ప్రేమకు సాటి రాగల శక్తి మరొకటి లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను మీరూ ఓమారు చూడండి.