Share News

Men: లైఫ్ కోచ్ చెబుతోన్న కారణాలివే..!!

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:46 PM

చేతన చక్రవర్తి.. లైఫ్ కోచ్. తన వద్దకు వచ్చిన క్లైయింట్లతో మాట్లాడతారు. గోల్స్ రీచ్ అయ్యేందుకు మార్గాలు చెబుతుంటారు. చాలా మంది కస్టమర్లను చూశాక.. ఆమె ఓ నిశిత అభిప్రాయానికి వచ్చారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించక మానదు.

Men: లైఫ్ కోచ్ చెబుతోన్న కారణాలివే..!!
Life Coach Chetna Chakravarthy

చేతన చక్రవర్తి (Chetna Chakravarthy).. లైఫ్ కోచ్. తన వద్దకు వచ్చిన క్లైయింట్లతో మాట్లాడతారు. గోల్స్ రీచ్ అయ్యేందుకు మార్గాలు చెబుతుంటారు. చాలా మంది కస్టమర్లను చూశాక.. ఆమె ఓ నిశిత అభిప్రాయానికి వచ్చారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించక మానదు. ఇంతకీ ఏంటంటే..?


పలువురు క్లైయింట్లతో మాట్లాడటం వల్ల చేతన కీ డెసిషన్ తీసుకున్నారు. జీవితంలో ఇండియన్ మగాళ్లతో డేట్‌కి వెళ్లొద్దనే కఠినమైన నిర్ణయం తీసుకుంది. అందుకు మూడు కారణాలు ఉన్నాయని చెబుతోంది. ఏంటంటే.


భారతీయ మగాళ్లు ఏ విషయంపై మాట్లాడరు.

భారతీయ మగాళ్లు ప్రతి విషయాన్ని సరిగ్గా వివరించరు.

భారతీయ మగాళ్లకు ఇళ్లు చక్కదిద్దడం రాదు.

ఈ కారణాల వల్ల వారితో డేట్‌కి వెళ్లొద్దని అనుకున్నానని తెగేసి చెప్పారు. కారణాలు చెబుతూ వీడియో తీసి సోషల్ మీడియా ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోకు ఇప్పటికే 12 వేల లైకులు రాగా, 79 వేల వ్యూస్ వచ్చాయి.


1. సరిగ్గా మాట్లాడరు: భారతీయ మగాళ్లు ఏ విషయంపై సరిగ్గా మాట్లాడరు. అలా అయితే సుధీర్ఘమైన అంశాలపై ఇరువురి మధ్య చర్చ ఎలా సాగుతుంది. ఏ విషయంపై వాదించకుండా సైలంట్‌గా ఉంటే మహిళ పై చేయిగా నిలుస్తోంది.

2. వివరించడం రాదు: మాట్లాడమే కాదు వివరించడం కూడా రాదు. వారికి రొమాన్స్ అంటే ఏంటో తెలియదు. వారికి చిన్నగా సైగలు చేయడం రాదు. పెద్ద పెద్ద బహమతులు అందజేసి ఆశ్చర్యపరచడం అస్సలు తెలియదు.

3. ఇంటిని శుభ్రంగా ఉంచడం తెలియదు: చివరగా ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచడమో తెలియదు. ఆ ఇంట్లో నువ్వు కూడా ఉంటున్నందున జాగ్రత్తగా ఉంచే విషయంపై అవగాహన ఉండాలి. అంతే తప్ప భాగస్వామికి సాయం చేస్తున్నామని భావనలో ఉండకూడదు.

భారతీయ మగాళ్ల గురించి అన్ని విషయాలు చెప్పి.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో ఇతరులకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.


చేతన చక్రవర్తి వీడియోకు పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. మీ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నా. కొన్ని విషయాల్లో మీరు లింగ భేదం చూపించారు. మీకు కొందరి వల్ల అనుభవాలు జరిగి ఉండొచ్చు. ఒక దేశాన్ని మీరు పాయింట్ అవుట్ చేయడం సరికాదు అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇది భారతీయ మగాళ్లకు సంబంధించిన సమస్య కానేకాదు.. లింగ భేదం స్పష్టంగా కనిపిస్తోందని మరొకరు కామెంట్ చేశారు. ఇలా పలువురు యూజర్లు కామెంట్ చేశారు.


Read Latest
Prathyekam News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 08:52 PM