Share News

Google Maps: మిస్సింగ్ కేసు.. పోలీసులకు చేతకానిది గూగుల్ మ్యాప్స్ చేసేసింది

ABN , Publish Date - May 11 , 2024 | 08:42 PM

గూగుల్ మ్యాప్స్.. ఇది మనల్ని మన గమ్యస్థానాలకు వేగంగా చేర్చడంలో సహాయం చేయడమే కాదు, మిస్సింగ్ కేసులను ఛేధించడానికి కూడా ఉపయోగపడుతోంది. పోలీసులకు సాధ్యం కాని పనులను..

Google Maps: మిస్సింగ్ కేసు.. పోలీసులకు చేతకానిది గూగుల్ మ్యాప్స్ చేసేసింది

గూగుల్ మ్యాప్స్ (Google Maps).. ఇది మనల్ని మన గమ్యస్థానాలకు వేగంగా చేర్చడంలో సహాయం చేయడమే కాదు, మిస్సింగ్ కేసులను ఛేధించడానికి కూడా ఉపయోగపడుతోంది. పోలీసులకు సాధ్యం కాని పనులను చేసి పెడుతోంది. ఇందుకు తాజా ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. రెండేళ్ల క్రితం ఓ వృద్ధురాలిని వెతికి పట్టడంలో గూగుల్ మ్యాప్స్ కీలక పాత్ర పోషించింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హోటల్‌కి వెళ్లిన భార్య.. వెనకాలే వెళ్లిన భర్త.. తీరా చూస్తే..

ఆ వృద్ధ మహిళ పేరు పాలెట్ లాండ్రిక్స్. ఆమె వయసు 83 సంవత్సరాలు. ఆమె అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో బాధపడుతోంది. కట్ చేస్తే.. 2020 నవంబర్ 2వ తేదీన ఆమె భర్త ఇంట్లో బట్టలు ఉతుకుతున్నప్పుడు, పాలెట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. అంతే.. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా అదృశ్యమైంది. ఈ విషయం ఆమె భర్తకు తెలియదు. మధ్యాహ్నం 1:00 గంట సమయంలో తన భార్య ఇంట్లో కనిపించకపోవడం, ఎంత వెతికినా దొరక్కపోవడంతో.. ఆయన తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. వాళ్లందరూ కలిసి వెతికినా పాలెట్ ఆచూకీ తెలియకపోవడంతో.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కాంగ్రెస్ అణుబాంబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ రియాక్షన్

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. అయితే.. ఎంత వెతికినా పాలెట్ దొరకలేదు. ఆమె కోసం వెతికి వెతికి పోలీసులు అలసిపోయి.. 2022 అక్టోబర్‌లో ఈ కేసుని మూసివేయాలని అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో.. ఓ అధికారి గూగూల్ మ్యాప్స్‌లో ఏదో చూశాడు. గూగుల్ స్ట్రీట్ వ్యూని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా.. పాలెట్ తప్పిపోయిన రోజు వీధి దాటుతున్న దృశ్యం కనిపించింది. దాని ఆధారంగా పోలీసులు మరోసారి ఆమెని వెతకడం స్టార్ట్ చేశారు. ఇరుగుపొరుగు వారిని విచారించడంతో పాటు సమీపంలోని వీధులన్ని జల్లెడ పట్టారు.

రీల్ కోసం నడిరోడ్డుపై హద్దుమీరిన యువతి.. మరీ ఇంత అవసరమా?

ఫైనల్‌గా.. పోలీసులకు పాలెట్ లాండ్రిక్స్ దొరికింది. కానీ.. దురదృష్టవశాత్తూ ఆమె సజీవంగా లేదు. తప్పిపోయిన రోజే ఆమె చనిపోయినట్లు రిపోర్ట్‌లో తేలింది. ఓ కొండపై నుంచి జారి పడి ఆమె మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది. తనకున్న అల్జీమర్స్ కారణంగానే.. దారి తప్పిపోయి ఆమె అకాల మరణం చెందిందని పోలీసులు గుర్తించారు. కాగా.. గతంలోనూ పాలెట్ ఇలాగే చాలాసార్లు తప్పిపోయింది కానీ, భర్త ఆమెని చాలాసార్లు వెతికి ఇంటికి తీసుకొచ్చాడు. కానీ.. ఈసారి ఆమె శవంగా తిరిగిరావడంతో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 11 , 2024 | 08:42 PM