ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: లగ్జరీ కారుతో ఇలానా..?

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:02 PM

పోర్షే కారుతో సిగరెట్ వెలిగించాలని అసద్ అనుకున్నాడు. కారు ఆన్ చేశాడు. ఎగ్జాస్ట్ నుంచి విడుదలయ్యే వాయువుతో సిగరెట్ వెలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పటాకులు అంటించే సమయంలా భయపడ్డాడు. ఊహించినట్టే జరిగింది. సిగరెట్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో వెంటనే పడవేశాడు. ఆ వీడియో ఇన్ స్టలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Hyderabad Man

హైదరాబాద్: కొందరి పిచ్చి పీక్‌కు చేరితే వింతగా ప్రవర్తిస్తారు. హైదరాబాద్‌కు చెందిన అసద్ ఖాన్ (Asad Khan) కూడా అలానే ప్రవర్తించాడు. ఇతనికి కార్లు అంటే పిచ్చి.. పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. పోర్షే 718 కేమాన్ కారుతో పిచ్చి ఆటలు ఆడాడు. ఆ వీడియో తీసి సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతని తీరుపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు.


ఏంటంటే..?

పోర్షే కారుతో సిగరెట్ వెలిగించాలని అసద్ అనుకున్నాడు. కారు ఆన్ చేశాడు. ఎగ్జాస్ట్ నుంచి విడుదలయ్యే వాయువుతో సిగరెట్ వెలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పటాకులు అంటించే సమయంలా భయపడ్డాడు. ఊహించినట్టే జరిగింది. సిగరెట్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో వెంటనే పడవేశాడు. ఆ వీడియో ఇన్ స్టలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ వచ్చాయి.



ట్యాగ్ లైన్ ఇదే..

వీడియోకు అసద్ ట్యాగ్ ఇలా పెట్టాడు. ‘సిగరెట్ కాల్చేందుకు మార్గం ఏంటి.? నేను సిగరెట్ తాగాను. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. నా ఎల్లో పోర్సే కారుతో సిగరెట్ వెలిగిస్తా అని’ రాసుకొచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఖాన్ వైఖరిని నెటిజన్లు ఎండగట్టారు. సిగరెట్‌కు మంటలు అంటి, ఖాన్ గాయపడ్డారు. మరోసారి ఇలా చేయకు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సిగరెట్ వెలిగించేందుకు ఇది ఉత్తమ మార్గం కావొచ్చు. దాంతో పాటు నీ చేయి కూడా కాలుతుందని మరొకరు సైటెర్లు వేశారు. ఖాన్‌కు ఫిజిక్స్ ప్రాథమిక సూత్రాలు తెలియవని మరొకరు ఆగ్రహం వ్యక్త చేశారు.



విమర్శలు

అసద్ ఖాన్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. లగ్జరీ కారుతో ఈ ఫీట్లు ఏంటీ అని అంతా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఫేమస్ కంటెంట్ క్రియేటర్.. మీరే ఇలా చేస్తే ఎలా అని మరొకరు అభిప్రాయపడ్డారు. వెరైటీ కోసం అసద్ ఖాన్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్ళలను ఎదుర్కొవాల్సి వస్తోంది.

Updated Date - Aug 13 , 2024 | 04:02 PM

Advertising
Advertising
<