Share News

Viral: 9 ఏళ్లలో 20 పెళ్లిళ్లు.. భార్యలందరికీ ఒకే ట్విస్ట్.. చివరకు ఏమైందంటే?

ABN , Publish Date - Jul 28 , 2024 | 08:31 PM

ఈజీమనీకి అలవాటుపడిన దుండగులు.. ఇతరులను మోసం చేసి, డబ్బులు దోచుకోవడమే పనిగా పెట్టుకుంటుంటారు. ఇందుకు వాళ్లు రకరకాల అవతారం ఎత్తుతుంటారు. ఇప్పుడు..

Viral: 9 ఏళ్లలో 20 పెళ్లిళ్లు.. భార్యలందరికీ ఒకే ట్విస్ట్.. చివరకు ఏమైందంటే?
Viral News

ఈజీమనీకి అలవాటుపడిన దుండగులు.. ఇతరులను మోసం చేసి, డబ్బులు దోచుకోవడమే పనిగా పెట్టుకుంటుంటారు. ఇందుకు వాళ్లు రకరకాల అవతారం ఎత్తుతుంటారు. ఇప్పుడు ఓ దుండగుడు సైతం నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. విడాకులు పొందిన మహిళలనే లక్ష్యంగా చేసుకొని.. వారిని పెళ్లి పేరుతో నమ్మించి.. మోసాలకు పాల్పడ్డాడు. ఇలా ఏకంగా 20 మందికి పైగా మహిళలను మోసం చేసి.. నగదుతో పాటు విలువైన వస్తువులతో పరారయ్యాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్

అతని పేరు ఫిరోజ్ నియాజ్ షేక్. వయసు 43 సంవత్సరాలు. ఈజీమనీకి అలవాటుపడిన అతగాడు.. విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసుకొని, డబ్బులు పొగేసుకోవాలని పన్నాగం పన్నాడు. అనుకున్నదే తడువుగా.. తన ప్లాన్‌ని అమలు చేయడం మొదలుపెట్టాడు. తొలుత మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళలు లేదా విడాకులు పొందిన వారితో స్నేహం చేసేవాడు. వారిని మాయమాటలతో నమ్మించి, పెళ్లికి ఒప్పించేశాడు. పెళ్లయ్యాక వారి వద్ద నుంచి లక్షల్లో నగదు, నగలు, విలువైన ఇతర వస్తువులు తీసుకొని పరారయ్యేవాడు. ఇలా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, దిల్లీ, యూపీ రాష్ట్రాల్లో 20 మందికి పైగా మహిళలను మోసం చేశాడు. చివరగా అతని చేతిలో మోసపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


2023 అక్టోబర్, నవంబర్ మధ్య కాలంలో తాను ఫిరోజ్‌కు రూ.6.5 లక్షలతో విలువైన వస్తువులు ఇచ్చానని.. పెళ్లి చేసుకున్నాకే తనని మోసం చేశాడని ఆ మహిళ పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తమదైన శైలిలో ఫిరోజ్ ఆచూకీ కనుగొని, అదుపులోకి తీసుకోగలిగారు. విచారణలో భాగంగా.. 20 మందికి పైగా మహిళలను అతడు మోసం చేశాడని తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు. 2015 నుంచి ఫిరోజ్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. అతను థానేలోని కళ్యాణ్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.6 లక్షలకు పైగా నగదుతో పాటు ల్యాప్‌టాప్, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజ్‌ను జులై 23వ తేదీన అరెస్టు చేశారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 08:31 PM