Viral: ఈ పెట్రోల్ బంక్ వాళ్లు నిజంగా గ్రేట్.. ఊర కుక్కను తీసుకొచ్చి..
ABN , Publish Date - Feb 06 , 2024 | 06:38 PM
వీధి కుక్కను చేరదీసి తమ మానవత్వాన్ని చాటుకున్న పెట్రోల్ బంక్ సిబ్బందిపై ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మనిషంటే అత్యంత విశ్వాసం గల ఒకే ఒక్క జంతువు కుక్క. కానీ, చుట్టూ ఎందరు మనుషులు ఉన్నా కూడా వీధుల్లో కుక్కలు మాత్రం దుర్భర జీవితం గడుపుతుంటాయి. ఇక ఇటీవల కాలంలో వీధి కుక్కలను మనుషులు దారుణంగా పొట్టనపెట్టుకున్న దృశ్యాలు కూడా నెటిజన్లను కన్నీళ్లు పెట్టించాయి. ఈ నేపథ్యంలో ఓ వీధి కుక్కను చేరదీసి మానవత్వం చాటుకున్న ఓ పెట్రోల్ బంక్ సిబ్బందిపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
pupss.acc అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ ఉదంతం తొలిసారిగా నెట్టింట కాలుపెట్టింది. ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కాని ఓ పెట్రోల్ బంక్‌లోని సిబ్బంది వీధి కుక్కకు తమ బంక్‌లోనే ఆశ్రయమిచ్చారు. బంక్‌లో అదీ ఓ ఉద్యోగే అన్నట్టు దానికో యూనిఫాం కూడా ఇచ్చారు. వేళకు ఇంత ఆహారం పెడుతూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక శునకానికి కూడా తన కొత్త జీవితం నచ్చిందేమో తెలీదు కానీ వీడియోలో అది చాలా ప్రశాంతంగా, రిలాక్సౌవుతూ కనిపించింది (Street dog gets job at fuel filling station).
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెట్రోల్ బంక్ సిబ్బందిని నెటిజన్లు తెగ పొడిడేస్తున్నారు. వాళ్లకు దేవుడి దీవెనలు ఎప్పటికీ ఉండాలంటూ మరికొందరు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి మానవత్వాన్నే కనబరిస్తే వీధి కుక్కలతో సమస్యలు కూడా తీరిపోతాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మానవత్వం నిజంగా గొప్పదంటూ ముక్తాయించారు. ఇలా రకరకాల కామెంట్స మధ్య ఈ వీడియో కొద్ది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది.