ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana Tourism Ananthagiri Hills: అందాలకు కేరాఫ్ అనంతగిరులు.. తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ.. అతి తక్కువ ధరలు

ABN, Publish Date - May 14 , 2024 | 08:07 PM

వేసవి వచ్చిందంటే చాలు.. ఎండలే కాదు.. పిల్లలకు సెలవులు సైతం వచ్చేస్తాయి. అయితే గతంలో పాఠశాలల్లో విద్యార్థులను విజ్జాన యాత్ర పేరిట.. వినోదం, విజ్జానం అందించేలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలకు పాఠశాల యాజమాన్యం తీసుకు వెళ్లేది.

Ananthagiri Hills

వేసవి వచ్చిందంటే చాలు.. ఎండలే కాదు.. పిల్లలకు సెలవులు సైతం వచ్చేస్తాయి. అయితే గతంలో పాఠశాలల్లో విద్యార్థులను విజ్జాన యాత్ర పేరిట.. వినోదం, విజ్జానం అందించేలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలకు పాఠశాల యాజమాన్యం తీసుకు వెళ్లేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో ఈ వేసవి సెలవుల్లో తమ పిల్లలకు ఉపయుక్తంగా ఉండేలా.. ఏదో ఓ ట్రిప్‌ చూట్టేయాలని వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకు తక్కువ బడ్జెట్‌లో.. అదీ కూడా సమీపంలో ఉండాలి. ఇలా వెళ్లి అలా వచ్చేలా ఉండాలి. అటువంటి టూర్‌లు ఏమైనా ఉన్నాయా? అంటూ ఆలోచిస్తూ.. అందుకోసం తమ సన్నిహితులు, బంధువులను ఆరా తీస్తుంటారు. అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ను సైతం వారు ప్లాన్ చేసుకుంటారు.


ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ టూరిజం వివిధ రకాల టూర్ల ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీల వల్ల ఎంతో మంది పర్యాటకులు నూతన ప్రదేశాలను చూశారు.. చూస్తున్నారు. ఆ క్రమంలో అనంతగిరి కొండలుకు వెళ్లేందుకు ప్యాకేజీ సైతం రూపొందించింది. తెలంగాణ అరుకులోయగా పిలిచే అనంతగిరి కొండలను ఒకే ఒక్క రోజులో.. చూసి వచ్చేలా కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఆ టూర్‌తోపాటు ఆ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ జిల్లాలో ఈ అనంతగిరి కొండలు ఉన్నాయి. అక్కడ పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు చూసి.. ప్రతీ ఒక్కరు ఫిదా అయిపోవాల్సిందే. అందుకే సెలవులు, వారాంతపు రోజుల్లో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రతీ శని ఆదివారాల్లో ఈ ట్రిప్‌ను తెలంగాణ టూరిజం అందుబాటులోకి తీసుకు వచ్చింది. జస్ట్ ఒక్క రోజు... అనంతగిరి హిల్స్‌కు వెళ్లి వచ్చేలా చాలా సౌకర్యవంతంగా ఈ ప్యాకేజీని తెలంగాణ టూరిజం రూపొందించింది.


టూర్ షెడ్యూల్ ఇలా...

  1. ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకున్న వారు.. సికింద్రాబాద్ అంటే ప్యారడైజ్ సమీపంలోని యాత్ర నివాస్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ఎక్కాలి. ఉదయం 9.00 గంటలకు బస్సు స్టార్ట్ అవుతుంది.

  2. మధ్యాహ్నం 12.00 గంటలకు అనంతగిరి చేరుకుంటారు.

  3. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 12.30 గంటల వరకు అనంతగిరిలో కొలువు తీరిన అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకోవచ్చు.

  4. అడవిలోకి వెళ్లి చూడాలనుకునే వారు.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల మధ్య వెళ్లి రావచ్చు.

  5. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు హరిత హోటల్‌లో శాఖహార భోజనం ఉంటుంది.

  6. 2.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య గేమ్స్ ఆడుకోవచ్చు.

  7. 4.30 గంటల నుంచి 5.00 గంటల మధ్య హరిత హోటల్‌లో టీ, స్నాక్స్ అందిస్తారు.

  8. సాయంత్రం 5.00 గంటలకు అనంతగిరి నుంచి బస్సు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.

  9. రాత్రి 8.00 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో.. ఈ ట్రిప్ ముగుస్తుంది.

ఇక టికెట్ ధరలు..

ఈ టూర్‌కు వెళ్లాలనుకునే వారు.. పెద్దలకు రూ.1800, పిల్లలకు రూ.1400గా టికెట్ ధర తెలంగాణ టూరిజం నిర్ణయించింది. ఈ టూర్‌తోపాటు ప్యాకేజీ గురించి మరింత సమచారం కోసం.. https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్​ను సంప్రదించవలసి ఉంటుంది.

Read Latest National and Telugu News

Updated Date - May 14 , 2024 | 08:28 PM

Advertising
Advertising