Share News

UP: తోడబుట్టిన సోదరుల దారుణం! అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడి హత్య..

ABN , Publish Date - Jun 16 , 2024 | 06:35 PM

అన్న పోయాక వదినను పెళ్లాడిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తోడబుట్టిన సోదరులే అతడిని పొట్టనపెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

UP: తోడబుట్టిన సోదరుల దారుణం! అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడి హత్య..

ఇంటర్నెట్ డెస్క్: అన్న పోయాక వదినను పెళ్లాడిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తోడబుట్టిన సోదరులే అతడిని పొట్టనపెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం (Viral) రేపుతోంది.

పూర్తి వివవరాల్లోకి వెళితే, బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఈశ్వర్‌కు సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్‌వీర్, యశ్‌వీర్ అనే కుమారులు ఉన్నారు. సుఖ్‌వీర్ గతేడాది మృతి చెందారు. ఈ క్రమంలో యశ్‌వీర్ తన వదినను పెళ్లాడాడు. అయితే, ఈ వివాహం మిగతా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో, వారి మధ్య తరచూ వివాదాలు తలెత్తేవి (UP man shot dead by brothers for marrying widow of eldest sibling).

Viral: ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన ఐస్‌క్రీమ్‌లో జెర్రె.. మహిళకు షాక్!


ఢిల్లీలో డ్రైవర్ గా చేసే యశ్‌వీర్ శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే అతడి ఇద్దరు సోదరులు మద్యం సేవించారు. మత్తులో ఉన్న వారు అతడి కనబడగానే మళ్లీ గొడవపడ్డారు. చివరకు క్షణికావేశంలో యశ్‌వీర్‌ను తుపాకీతో కాల్చి చంపేశారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 06:35 PM