Viral: మన బతుకులు ఇంతేనా.. దేశం ఇంకెప్పుడు మారుతుందో.. గుండెల్ని పిండేస్తున్న వీడియో
ABN , Publish Date - May 21 , 2024 | 05:31 PM
రద్దీ ఎక్కువగా ఉన్న రైల్లో మెట్లపై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో వైరల్‌గా మారింది. దేశంలో మౌలిక సదుపాయాల కొరతపై జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సామాన్యులకు ప్రధాన రవాణా సాధనమైన రైళ్లల్లో రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. సామాన్యులకు కావాల్సినన్ని రైళ్లు అందుబాటులో లేక ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా మరో వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. రైళ్లల్లో సీట్లు దొరక్క ప్రజలు ఎంతటి రిస్క్‌తో ప్రయాణిస్తున్నారో చెప్పే ఈ వీడియో జనాల్ని కదిలిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా పరిస్థితుల్లో ఇంకెప్పుడు మార్పు వస్తుందో అని అనేక మంది నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Viral: సముద్రంపై డేగను తలదన్నేలా గాల్లో ఎగురుతున్న చేప.. అబ్బురపరిచే వీడియో!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు రద్దీగా ఉన్న రైల్లో ఎక్కేందుకు నానా యాతనా పడ్డారు. రైలు స్టేషన్ దాటి క్రమంగా వేగం పుంజుకుంటున్నా వారు లెక్క చేయలేదు. లగేజీని ఓ చేత్తో మోస్తూ మరో చేత్తు డోర్ పక్కనున్న రాడ్ పట్టుకుని మెట్లపై నిలబడేందుకు ఓ వ్యక్తి నానా తంటాలూ పడ్డాడు. రైల్లో వేలు పెట్టేందుకు జాగా కూడా లేకపోయినా ఎలాగొలా తన వెంట వచ్చిన మహిళలను రైలు ఎక్కించిన అతడు మెట్టుపై ఎక్కేందుకు నానా అవస్థలూ పడ్డాడు. అతనితో పాటు మహిళలు కూడా ప్రమాదకరంగా తలుపు వద్ద ఉన్న మెట్లపై నిలబడే ప్రయాణించారు. అతడికి ఏ విధంగానూ సాయం చేయలేని స్థితిలో రైల్లోని ఉన్న ఇతర ప్రయాణికులు చూస్తుండిపోయారు. వీడియో అక్కడితో ఆగిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు (Viral video shows overcrowded train boarding sparking outrage on social media).
Viral: మగ సింహం ప్రేమ అంటే ఇదీ.. ఆడ సింహం కోసం ఎంత రిస్క్ చేసిందంటే..
వీడియో చూసిన జనాలు మాత్రం రైళ్ల పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేస్తున్నారు. మెట్లపై ప్రయాణించిన వ్యక్తి చివరకు ప్రమాదంలో పడి ఉండొచ్చేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సామాన్యుల కష్టాలు గుండెల్ని పిండేస్తున్నాయని కొందరు అన్నారు. ప్రజావసరాలకు తగిన్ని రైళ్లను రైల్వే శాఖ తక్షణం అందుబాటులోకి తేవాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా దేశంలో ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో రాకపోవడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంకెప్పుడు మారుతుందో అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Viral: రేయ్..ఎవర్రా మీరంతా.. పుచ్చకాయల్ని ఎలా కల్తీ చేస్తున్నారో చూస్తే..