Travel: ఫిబ్రవరి నెలలో ట్రావెల్ చేయాలనుకుంటున్నారా?.. ఈ డెస్టినేషన్ ప్లేసెస్ మీ కోసం..
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:29 AM
జనవరి నెల ముగియనుంది. దీంతో పాటు చలి తీవ్రత కూడా తగ్గింది. కాబట్టి ట్రావెల్ లవర్స్ కు ఫిబ్రవరి నెల అద్భుతంగా ఉంటుంది.
జనవరి నెల ముగియనుంది. దీంతో పాటు చలి తీవ్రత కూడా తగ్గింది. కాబట్టి ట్రావెల్ లవర్స్ కు ఫిబ్రవరి నెల అద్భుతంగా ఉంటుంది. చల్లని గాలులు ఉండవు.. మండే ఎండలు అసలే ఉండవు. ఈ నెల ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే.. ఈనెలలో వెళ్లాల్సిన ప్లేసెస్ కూడా మనదేశంలో చాలానే ఉన్నాయి. వెళ్లాలనే ఆసక్తి ఉండాలే గానీ.. ఒంటరి ప్రయాణం ఒంటరి తనాన్ని దూరం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫిబ్రవరిలో ఎక్కడికైనా వెళ్లాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ కొన్ని అందమైన ప్రదేశాల గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాం. అవెంటో ఇప్పుడు చూద్దాం..
కూర్గ్..
మనదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో కూర్గ్ ఒకటి. కూర్గ్, స్కాట్లాండ్ మధ్య చాలా పోలీకలు ఉన్నాయి. పర్వతాలు, అడవుల అందాలతో కూర్గ్ పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి నెలలో ఈ ప్రాంతంలో అతి చలి గానీ, వేడి గానీ ఉండదు.
ఖజురహో..
మీరు నిజమైన కళా ప్రేమికులైతే.. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోను తప్పక సందర్శించాలి. ఖజురహో దేవాలయాలకు ప్రసిద్ధి. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలను చూసేందుకు యాత్రికులు వస్తుంటారు. లక్ష్మణ్ టెంపుల్, పన్నా నేషనల్ రిజర్వ్, రానేహ్ జలపాతం, అజీగఢ్ కోటలు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు.
మహాబలేశ్వర్..
మహారాష్ట్రలోని చాలా అందమైన హిల్ స్టేషన్ పంచగని. ఇక్కడ అందమైన పర్వతాలు ఉన్నాయి. వీటి సుందర దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఇక్కడ ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు మించదు. సో.. ఈ మంత్ లో విహరించేందుకు విహంగమై విహరించేందుకు బ్యాక్ ప్యాక్ తో సిద్ధమైపొండి..
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.