Winter solstice 2024: పగలు 8 గంటలు.. రాత్రి 16 గంటలు.. ప్రత్యేకమైన ఈ రోజు చేయాల్సిన పనులివే..
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:43 AM
వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలు కాగా.. ఇందులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పగలు కేవలం 8గంటలు మాత్రమే అంటే ఆశ్చర్యం కలగకమానదు. అవును మీరు విన్నది నిజమే.. ఈ రోజు అనగా..
వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలు కాగా.. ఇందులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పగలు కేవలం 8గంటలు మాత్రమే అంటే ఆశ్చర్యం కలగకమానదు. అవును మీరు విన్నది నిజమే.. ఈ రోజు అనగా.. డిసెంబర్ 21న పగలు కేవలం 8 గంటల మాత్రమే ఉండనుంది. ఇదేంటీ.. అని ఆలోచిస్తున్నారా.. దీనికో కారణం కూడా ఉంది. ‘‘అయానంతం’’.. అని పిలబడే ఈ ప్రత్యేక దినానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది మొత్తానికి డిసెంబర్ 21 (December 21) ప్రత్యేకమైన దినమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజు పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉంటుందట. అలాగే రాత్రి సుదీర్ఘంగా 16 గంటల పాటు ఉండనుందట. సాధారణంగా ఉత్తరార్ధగోళంలో శీతాకాలపు మొదటి రోజును అయనాంతం అని పిలుస్తుంటారు. ఈ సమయంలో భూమి తన ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుందట. ప్రత్యేకమైన ఈ రోజు సూర్యకిరణాలు భూమిపైకి ఆలస్యంగా చేరతాయట. దీంతో ఉష్ణోగ్రతల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొంచెం వంగుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య చాలా దూరం ఉంటుంది. అలాగే చంద్రుడి కాంతి ఎక్కువ సమయం ఉంటుంది. ప్రతి ఏడాదీ శీతాకాలంలో ఇలాంటి ఓ ప్రత్యేకమైన రోజు వస్తుంది.
శనివారం సూర్యుడు భూమి దక్షిణార్ధగోళంలోని అత్యున్నత బిందువులో ఉంటాడన్నమాట. మరోవైపు జ్యోతిష్య ప్రకారం ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్లేందుకు సిద్ధమవుతుంటాడని పండితులు చెబుతున్నారు. పగటి సమయం తక్కువగా ఉండడం, రాత్రి సమయం ఎక్కువగా ఉండడంపై వివిధ దేశాల్లో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. చైనా, తూర్పు ఆసియా దేశాల్లో ఈ రోజును ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా పిలుచుకుంటుంటారు. ఈ సందర్భంగా వారి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఈ రోజున శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గీతాపారయణం చేస్తుంటారు. ఇక రాజస్థాన్‌లో అయితే షుష్య మాసం పేరుతో పండుగ చేసుకుంటారు.