Team India: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత జట్టు లేకుండానే వరల్డ్ కప్
ABN, Publish Date - Nov 19 , 2024 | 05:56 PM
పాకిస్తాన్ తో కీలక సిరీస్ నుంచి భారత్ వైదొలగింది. ఇప్పటికే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఇరు దేశాల కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తమ వైఖరిని స్పష్టం చేసింది..
ముంబై: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత జట్టు మరోసారి షాకిచ్చింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమవుతున్న వేళ తాజాగా భారత క్రికెట్ జట్టు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. దీని ద్వారా తమ క్రికెటర్ల భద్రత అంశంలో తామెంత కఠినంగా ఉన్నామనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
తాజాగా అంధుల ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ షిప్ నుంచి భారత్ వైదొలగింది. దీంతో భారత జట్టు లేకుండానే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. పాకిస్తాన్ వెళ్లడానికి అంధుల క్రికెట్ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) లభించింది. కానీ, భారత క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటించడానికి భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. భారత జట్టును అక్కడికి పంపడానికి విదేశాంగ శాఖ ఆమోదం తెలపలేదు. టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు పాక్‌లో పర్యటించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిందని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ తెలిపారు.
ఇటీవలి కాలంలో అంధుల క్రికెట్ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సత్తా చాటుతూవస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు ఎడిషన్‌లలో 2012, 2017, 2022లో విజయం సాధించింది. భారత్ చివరి సారిగా 2014లో ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్తాన్ లో పర్యటించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్ష్ ట్రోపీపై భారత పురుషుల క్రికె్ జట్టు వైఖరినపై పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పర్యటించబోమని భారత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ICC Champions Trophy: కాంప్రమైజ్ కావాల్సిందే.. పాక్ బోర్డుకు ఐసీసీ స్ట్రాంగ్ మెసేజ్..
Updated Date - Nov 19 , 2024 | 07:21 PM