ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: వేసవి వినోదం.. ధనాధన్‌కు సిద్ధం

ABN, Publish Date - Mar 14 , 2024 | 07:41 AM

ధనాధన్‌ పండుగకు రంగం సిద్ధమైంది. వేసవి వినోదంలో విశ్వవ్యాప్తంగా అత్యుత్తమ క్రీడా సంబరంగా నిలిచే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వచ్చేస్తోంది. ప్రపంచంలోని క్రికెటర్లంతా ఒక్కచోట చేరి సందడి చేసే ఐపీఎల్‌ మరో ఎనిమిది రోజుల్లో మొదలవనుంది.

ధనాధన్‌ పండుగకు రంగం సిద్ధమైంది. వేసవి వినోదంలో విశ్వవ్యాప్తంగా అత్యుత్తమ క్రీడా సంబరంగా నిలిచే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వచ్చేస్తోంది. ప్రపంచంలోని క్రికెటర్లంతా ఒక్కచోట చేరి సందడి చేసే ఐపీఎల్‌ మరో ఎనిమిది రోజుల్లో మొదలవనుంది. ఈ మెగా లీగ్‌లో సత్తా చాటేందుకు ఆయా జట్లు ఇప్పటికే తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. టైటిలే లక్ష్యంగా ఆటగాళ్లంతా కఠోరమైన ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మునిగితేలుతూ, ప్రత్యర్థి జట్ల బలాబలాలపై వ్యూహరచనలు చేస్తూ లీగ్‌కు సన్నద్ధమవుతున్నారు.


ఐపీఎల్‌ అనగానే అభిమానులకు గుర్తొచ్చేది మహేంద్ర సింగ్‌ ధోనీ. లీగ్‌లో అత్యంత పాపులర్‌ జట్టు అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథి. ఈసారి మహీని కొత్త పాత్రలో చూడబోతున్నారంటూ ఇటీవల ఓ సంచలన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అంటే... ఈమారు ధోనీ మైదానంలో ఆటగాడిగా గాకుండా జట్టుకు మెంటార్‌గా బరిలోకి దిగనున్నాడా? ఇక మహీ విన్యాసాలు చూడలేమా? అంటూ అనేకమంది అభిమానులు ఆ పోస్ట్‌తో గందరగోళానికి గురయ్యారు. ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్న విషయంపై ఇంకా స్పష్టత రాకపోయినా..ధోనీ మాత్రం ఇప్పటికే సీఎస్‌కే జట్టుతో కలసిపోయాడు. అయితే, ప్రతిసారీ తనదైన హెయిర్‌ స్టైల్స్‌తో ప్రయోగాలు చేసే ధోనీ మునుపటి తరహాలో అభిమానులను కనువిందు చేయనున్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంభించినప్పుడు పొడవైన జుత్తుతో కనిపించి అప్పట్లో అందరిచూపును తనవైపు తిప్పుకొన్న ధోనీ.. ఈ సీజన్‌లో కూడా అలాగే కనిపించనున్నాడు. పొడవాటి జట్టుతో తలకు ఎర్రటి బంధనా కట్టుకొని మహీ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోను సీఎస్‌కే సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. దీన్ని చూసిన అభిమానులు పాత రోజులను గుర్తు చేసుకొంటూ సంబరపడుతున్నారు.

అన్ని మ్యాచ్‌లకూ అందుబాటులో..

ఈ సీజన్‌ ఐపీఎల్‌ మొత్తానికి ఇంగ్లండ్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు బెయిర్‌స్టో అందుబాటులో ఉండనున్నాడు. భారత్‌తో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ ఇటీవలే ముగియడంతో.. ఇంగ్లండ్‌ ఆటగాళ్లందరూ స్వదేశానికి వెళ్లారు. అయితే, ధర్మశాలలో జరిగిన ఆఖరి టెస్టు సందర్భంగా.. ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లపై ఇంగ్లిష్‌ బోర్డుతో బీసీసీఐ అధికారులు చర్చించారు. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టోక్స్‌, రూట్‌, మార్క్‌ ఉడ్‌ మెగా లీగ్‌కు పూర్తిగా దూరమయ్యారు. కానీ, బెయిర్‌స్టో సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు. అతడు ఈ నెల 18 లేదా 19న భారత్‌కు వస్తాడని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. కాగా, బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా ఉన్న వసీమ్‌ జాఫర్‌ను తప్పించిన కింగ్స్‌.. ఆ బాధ్యతలను క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమితుడైన బంగర్‌కు అప్పగించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 07:41 AM

Advertising
Advertising