Share News

Year Ender 2024: ఈ ఏడాది టాప్-5 బెస్ట్ క్యాచెస్.. ప్రతిదీ ఆణిముత్యమే..

ABN , Publish Date - Dec 17 , 2024 | 10:32 AM

ఈ ఏడాది క్రికెట్‌లో కొన్ని అద్భుతమైన క్యాచులు అభిమానుల్ని మెస్మరైజ్ చేశాయి. అందులో ప్రతిదీ ఆణిముత్యమే. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండే ఆ క్యాచెస్ లిస్ట్ మీ కోసమే..

Year Ender 2024: ఈ ఏడాది టాప్-5 బెస్ట్ క్యాచెస్.. ప్రతిదీ ఆణిముత్యమే..
Best Catches In 2024

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా అభిమానుల్ని తమ గేమ్‌తో అలరించారు క్రికెటర్లు. ఆ టీమ్, ఈ టీమ్ అనేం లేదు.. డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఆటగాళ్లంతా ఫ్యాన్స్‌కు మస్తు మజా పంచారు. ముఖ్యంగా ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలి. గత కొన్నేళ్లలో ప్రొఫెషనల్ క్రికెటర్స్ అంతా ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడ్డారు. ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టడంతో ఆ ఎఫెక్ట్‌ క్యాచింగ్, రనౌట్స్‌లో కనిపిస్తోంది. భారీగా ప్రాక్టీస్ చేస్తూ బెస్ట్ క్యాచెస్‌తో దుమ్ములేపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది క్రికెట్‌లో టాప్-5 బెస్ట్ క్యాచెస్ ఏవి అనేది ఇప్పుడు చూద్దాం..


సూర్యకుమార్ యాదవ్

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. టీమిండియా నుంచి1 చేజారిన మ్యాచ్‌ ఒక్క క్యాచ్‌తో మలుపు తిరిగింది. సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన బాల్ సిక్స్‌కు వెళ్తుండగా అడ్డుపడ్డాడు సూర్యకుమార్ యాదవ్. బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసి పట్టుకొని... గాల్లోకి విసిరి కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు. బాల్‌ను పట్టిన సమయంలో అతడి బాడీ బ్యాలెన్స్, టైమింగ్ కారణంగా ఇది బెస్ట్ క్యాచ్‌గా ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది. ఆ సూపర్ క్యాచ్‌తో మ్యాచే కాదు.. వరల్డ్ కప్ కూడా భారత్ ఒడిలోకి చేరింది.


రవి బిష్ణోయ్

ఐపీఎల్-2024లో ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో అందరి మనసుల్ని దోచుకున్నాడు లక్నో సూపర్ జియాంట్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్. అతడు వేసిన గూగ్లీని స్ట్రయిట్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ కేన్ విలియమ్సన్. కానీ షాట్ కనెక్ట్ అవకపోవడం, టైమింగ్ మిస్ అవడంతో బంతి గాల్లోకి లేచింది. అంతే రనప్ పూర్తి చేసుకున్న బిష్ణోయ్.. పక్షిలా అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.


రమణ్‌దీప్ సింగ్

ఈ ఐపీఎల్ సీజన్‌లో మరో బెస్ట్ క్యాచ్ కూడా నమోదైంది. దాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ అందుకున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో కులకర్ణి ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ అందుకున్నాడు రమణ్‌దీప్. 1983 వరల్డ్ కప్‌లో లెజెండ్ కపిల్‌దేవ్ పట్టిన తరహాలో బ్యాక్ క్యాచ్‌ను గాల్లోకి ఎగిరి అందుకున్నాడు.


ఎయిడెన్ మార్క్రమ్

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎయిడెన్ మార్క్రమ్ ఓ సూపర్బ్ క్యాచ్‌తో మెరిశాడు. స్మట్స్ కొట్టిన బంతిని మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ ఒక్కసారిగా గాల్లోకి దూకి అందుకున్నాడు. తనను దాటి దూసుకెళ్తున్న బంతిని కుడి చేతితో అమాంతం పట్టుకొని.. ఎడమ చేతిపై బ్యాలెన్స్ వేసి కిందకు ల్యాండ్ అయ్యాడు. అతడి టైమింగ్, జడ్జ్‌మెంట్, టెక్నిక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.


కార్స్

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌కు మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లీష్ క్రికెటర్ కార్స్ పట్టిన క్యాచ్ కూడా అభిమానుల మనసులు దోచుకుంది. స్టీవ్ స్మిత్ ఫ్లిక్ చేసిన బంతిని బౌండరీ లైన్ దగ్గర దూకి అద్భుతంగా అందుకున్నాడు కార్స్. ఆ సమయంలో అతడి వెయిట్ ట్రాన్స్‌పర్, టైమింగ్, రన్నింగ్, కాన్‌సంట్రేషన్ హైలైట్‌గా నిలిచాయి.


మరిన్ని ఇయర్ ఎండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని క్రీడా వార్తల కోసం:

షకీబ్‌ బౌలింగ్‌పై సస్పెన్షన్‌

అటు వర్షం.. ఇటు వికెట్లు

జట్టు సంధి దశలో ఉంది

Updated Date - Dec 17 , 2024 | 11:00 AM