Share News

యూఎస్‌ ఓపెన్‌ అరుదైన రికార్డు

ABN , Publish Date - Sep 11 , 2024 | 03:15 AM

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గతవారం ముగిసిన ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని పది లక్షల మందికిపైగా అభిమానులు నేరుగా స్టేడియానికి వచ్చి....

యూఎస్‌ ఓపెన్‌ అరుదైన రికార్డు

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గతవారం ముగిసిన ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని పది లక్షల మందికిపైగా అభిమానులు నేరుగా స్టేడియానికి వచ్చి తిలకించడం విశేషం. అర్హత పోటీలతో కలుపుకొని మూడు వారాల పాటు జరిగిన ఈ టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎనిమిది శాతం పెరిగింది. అర్హత పోటీలను లక్షా 48 వేల 669 మంది, మెయిన్‌ డ్రా పోటీలను 8 లక్షల 32 వేల 640 మంది నేరుగా వీక్షించారు.

Updated Date - Sep 11 , 2024 | 03:31 AM