Share News

ఆసీ్‌సపై యువ భారత్‌ గెలుపు

ABN , Publish Date - Oct 03 , 2024 | 02:57 AM

తీవ్ర ఒత్తిడిలో నిఖిల్‌ కుమార్‌ (55 నాటౌట్‌) అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. అండర్‌-19 అనధికార టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది...

ఆసీ్‌సపై యువ భారత్‌ గెలుపు

అండర్‌-19 అనధికార టెస్ట్‌

చెన్నై: తీవ్ర ఒత్తిడిలో నిఖిల్‌ కుమార్‌ (55 నాటౌట్‌) అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. అండర్‌-19 అనధికార టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఆటకు మూడో రోజైన బుధవారం ఆసీస్‌ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 214/8 స్కోరు చేసి గెలిచింది. నిత్య పాండ్యా (51), కార్తికేయ (35) రాణించారు. మొదటి ఇన్నింగ్స్‌లో శతకంతో అదరగొట్టిన వైభవ్‌ సూర్యవంశీ (1) విఫలమయ్యాడు. ఐడెన్‌ ఒకానర్‌ 4 వికెట్లు, విశ్వ రామ్‌కుమార్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్‌ స్కోరు 110/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించి ఆసీస్‌ 214 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్‌ మహ్మద్‌ ఎనాన్‌ 6 వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 293, భారత్‌ 296 పరుగులు చేశాయి.

Updated Date - Oct 03 , 2024 | 02:57 AM