Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఇంటి అడ్రస్ మార్చలేకపోతున్నారా.. ఇలా చేయండి
ABN , Publish Date - Mar 10 , 2024 | 04:48 PM
రోజువారీ జీవితాల్లో గూగుల్ మ్యాప్స్ ఎంతటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయో తెలిసిందే. మనం ఉన్న లోకేషన్ తెలుసుకోవాలన్నా.. ఇతరులు ఉన్న ప్రాంతాన్ని కనుక్కోవాలన్నా గూగుల్ మ్యాప్స్ తప్పనిసరి. ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే ఈ మ్యాప్స్ చాలా ఉపయోగపడతాయి.
ఇంటర్నెట్ డెస్క్: రోజువారీ జీవితాల్లో గూగుల్ మ్యాప్స్ ఎంతటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయో తెలిసిందే. మనం ఉన్న లోకేషన్ తెలుసుకోవాలన్నా.. ఇతరులు ఉన్న ప్రాంతాన్ని కనుక్కోవాలన్నా గూగుల్ మ్యాప్స్ తప్పనిసరి. ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే ఈ మ్యాప్స్ చాలా ఉపయోగపడతాయి.
రూట్ ప్లానింగ్, లొకేషన్ ట్రాకింగ్ కోసం ఇది చాలా ముఖ్యం. గూగుల్ మ్యాప్స్‌లో ఇంటి అడ్రస్ కూడా ఎంటర్ చేసే ఆప్షన్ ఉంటుందని మీకు తెలుసా. అయితే చాలా మందికి ఇంటి అడ్రస్‌ని ఎలా మార్చాలనేదానిపై సందేహాలుంటాయి. అలాంటి వారు గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా ఇలా చేయండి.
స్టెప్ 1: మొబైల్‌లో Google Maps యాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: పైన కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా ఇనిషియల్స్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: 'సెట్టింగ్స్' అనే ఆప్షన్‌కి వెళ్లి.. 'ఇల్లు లేదా కార్యాలయాన్ని మార్చుకోండి' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: మీ ప్రస్తుత ఇంటి చిరునామా పక్కన ఉన్న మూడు చుక్కలను నొక్కండి.
స్టెప్ 5: డ్రాప్-డౌన్ మెనులో 'ఎడిట్ హోమ్'ని ఎంచుకోండి.
స్టెప్ 6: తరువాత మీకు రెండు ఆప్షన్‌లు వస్తాయి. సర్చ్ టేబుల్‌లో కొత్త చిరునామాను టైప్ చేయండి. సూచనల నుంచి సరైనదాన్ని ఎంచుకోండి. 'మ్యాప్‌లో ఎంచుకోండి' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తరువాత గూగుల్ పిన్‌ను కచ్చితమైన స్థానంలో ఉంచండి.
స్టెప్ 8: కొత్త చిరునామాను ఎంచుకున్న తర్వాత సేవ్ చేయండి.
Google అకౌంట్ సెట్టింగ్‌ల ద్వారా:
స్టెప్ 1: వెబ్ బ్రౌజర్ ద్వారా మీ Google అకౌంట్ సెట్టింగ్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2: ఎడమవైపు మెనులో 'వ్యక్తిగత సమాచారం'పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: 'మీ చిరునామాలు' విభాగంలోని 'హోమ్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: కొత్త ఇంటి చిరునామాను నమోదు చేయండి.
స్టెప్ 5: సెట్టింగ్‌లను సేవ్ చేయండి.