WhatsApp: వాట్సాప్ చాట్‌లో కీలక మార్పు.. కొత్త టైపింగ్ ఇండికేటర్ రిలీజ్
ABN , Publish Date - Nov 28 , 2024 | 09:53 AM
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వినియోగదారుల అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడానికి కంపెనీ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే వాయిస్ నోట్స్ ఫీచర్‌ను ఇటీవల ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇప్పుడు చాట్ విభాగంలో కీలక మార్పు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వాట్సాప్ (WhatsApp) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్. దీనిని బిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. అనేక కొత్త యాప్‌లు WhatsApp ప్రజాదరణను సవాలు చేయడానికి ప్రయత్నించాయి. కానీ ఇది వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న క్రమంలో అనేక మంది వినియోగిస్తున్నారు. దీంతో ఇది అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయవంతమైందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు టైప్ చేస్తున్నారో
ఇప్పటి వరకు వాట్సాప్‍లో ఎవరైనా సందేశాన్ని టైప్ చేసినప్పుడు, వారి పేరు క్రింద ఒక చిన్న గుర్తు కనిపిస్తుంది. ఇది సందేశాన్ని ఎవరు టైప్ చేస్తున్నారో సూచిస్తుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ ఈ పద్ధతిని మారుస్తోంది. ఇప్పుడు ఎవరైనా సందేశాన్ని టైప్ చేసినప్పుడు, సందేశాలు వచ్చిన చాట్ స్క్రీన్‌పై వారి పేరు నేరుగా కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు ఎవరు సందేశాన్ని టైప్ చేస్తున్నారో సులభంగా తెలుసుకోవచ్చు. దీంతో అవతలివారు సైతం సులభంగా చాట్ చేయగలుగుతారు.
కొత్త టైపింగ్ ఫీచర్
ఇది కాకుండా ఎవరైనా వాయిస్ సందేశాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు దాని సూచిక కూడా చాట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో ఎవరైనా సందేశాన్ని టైప్ చేసినా లేదా వాయిస్ సందేశాన్ని రికార్డ్ చేసినా కూడా వినియోగదారులు మొత్తం సమాచారాన్ని ఒకే చోట పొందుతారు. ఇది వినియోగదారులకు చాట్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది. నివేదికల ప్రకారం WhatsApp ఈ కొత్త ఫీచర్ వినియోగదారులందరికీ క్రమంగా విడుదల చేయడం ప్రారంభించింది.
చాలా మంది వాట్సాప్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. ఈ మార్పు మొదట WhatsApp బీటా వెర్షన్‌లో వచ్చింది. దీనికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఈ మార్పు iOS వెర్షన్ వినియోగదారులకు తక్కువగా కనిపిస్తుంది.
మిశ్రమ స్పందనలు
ఈ మార్పు మొదట ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఐఫోన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీనిని బాగుందని చెబుతుండగా, మరికొంత మంది మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఫీచర్‌పై వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ వినియోగదారుల అభిప్రాయం ఆధారంగా మార్పులు చేస్తుందా లేదా అనేది చూడాలి మరి. ఇంతకు ముందు కూడా కంపెనీ “ఆన్‌లైన్”, “టైపింగ్ అనే పదాలను చూపించడానికి ప్రయత్నించింది. తర్వాత దానిని “టెస్టింగ్” అని చెప్పి ఉపసంహరించుకుంది
ఇవి కూడా చదవండి:
Apple iPhone: ఫోన్ల చోరీ నుంచి రక్షణ కోసం క్రేజీ ఫీచర్.. వీటిలో మాత్రమే..
Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
For More Technology News and Telugu News