Basara Triple IT: విద్యార్థులకు అలర్ట్.. బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల
ABN, Publish Date - May 27 , 2024 | 07:53 PM
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (బాసర ట్రిపుల్ ఐటీ) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జూన్ 1నుంచి దరఖాస్తుల ప్రక్రియ మెదలై జూన్ 22తో ముగిస్తుంది.
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (బాసర ట్రిపుల్ ఐటీ) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జూన్ 1నుంచి దరఖాస్తుల ప్రక్రియ మెదలై జూన్ 22తో ముగిస్తుంది. జులై 3న సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. జులై 8నుంచి 10వరకు సెలెక్ట్ అయిన విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఈ మేరకు యూనివర్శిటీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. లేదంటే మీసేవ ద్వారా కూడా అప్లై చేయవచ్చని సూచించారు. కోర్సులో జాయిన్ అయితే రెండేళ్ల ఇంటర్ సహా ఇంజినీరింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం యూనివర్శిటీ వెబ్ సైట్‌ను చూడాలని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
CS Santhi kumari: ట్యాంక్ బండ్‌పై అదిరిపోనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
Phone tapping: నా ఓటమికి కేసీఆరే కారణం.. ఆవేదనలో ఎమ్మెల్యే..
Updated Date - May 27 , 2024 | 07:53 PM