అడవుల సంరక్షణకు కృషి చేయాలి
ABN , Publish Date - Oct 27 , 2024 | 10:23 PM
అడవుల సంరక్ష ణకు కృషి చేయాలని కవ్వాల్ టైగర్ రిజర్వ్ సీఎఫ్, ఎఫ్‌డీపీటీ శాంతా రామ్ అన్నారు. తాని మడుగు బీట్ పరిధిలో జరుగుతున్న టేకు చెట్ల నరికివేతను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్‌సింగ్, తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆఫీసర్ రమాదేవి కలిసి ఆదివారం పరిశీలించారు.
దండేపల్లి/జన్నారం, అక్టోబరు 27 (ఆంధ్ర జ్యోతి): అడవుల సంరక్ష ణకు కృషి చేయాలని కవ్వాల్ టైగర్ రిజర్వ్ సీఎఫ్, ఎఫ్‌డీపీటీ శాంతా రామ్ అన్నారు. తాని మడుగు బీట్ పరిధిలో జరుగుతున్న టేకు చెట్ల నరికివేతను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్‌సింగ్, తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆఫీసర్ రమాదేవి కలిసి ఆదివారం పరిశీలించారు.
అడవులను రక్షించడంలో అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అడవుల సంరక్షణతో పాటు చిన్నారుల్లో వన్యప్రాణులపై అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సీతాకోక చిలుకల సర్వే, పక్షుల సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామని వివరించారు.