తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ABN, Publish Date - Nov 17 , 2024 | 10:19 PM
తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం పడ్తన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
హాజీపూర్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం పడ్తన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి పది రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కేంద్రాలు ప్రారంభిస్తున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదన్నారు. ఎలాంటి కోతలు లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. గడ్డం స్వామిగౌడ్, కృష్ణమూర్తి, మోటపలు కుల తిరుపతి, వెంకటరమణరావు, సత్యం, ప్రశాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Nov 17 , 2024 | 10:19 PM