Share News

జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్‌ 3 పరీక్ష

ABN , Publish Date - Nov 17 , 2024 | 10:26 PM

జిల్లాలో ఆదివారం గ్రూప్‌ 3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పేపర్‌ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరిగింది. ఉదయం పేపర్‌ 1కు 15,038 మంది అభ్యర్థులకుగాను 8304 మంది హాజరు కాగా 6734 మంది గైర్హజరయ్యారు.

జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్‌ 3 పరీక్ష

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం గ్రూప్‌ 3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పేపర్‌ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరిగింది. ఉదయం పేపర్‌ 1కు 15,038 మంది అభ్యర్థులకుగాను 8304 మంది హాజరు కాగా 6734 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం పేప రు 2కు 15038 మందికి 8246 మంది హాజరు కాగా 6792 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 55 శాతం నమోదైంది. డీసీపీ భాస్కర్‌ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పరీక్ష కేంద్రాల బందో బస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించారు. సోమ వారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష జరగనుంది.

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, డీసీపీ

మొదటి రోజు గ్రూప్‌ 3 పరీక్ష ప్రశాంత వాతా వరణంలో సజావుగా జరిగిందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్‌ కళా శాల, శ్రీచైతన్య పాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరీక్ష నిర్వహణకు 48 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష నోడల్‌ అధికారి, పోలీసు నోడల్‌ అధికారి, రీజియన్‌ కోఆర్డినేటర్‌లతోపాటు ప్రతీ పరీక్ష కేం ద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజి లేటర్లను నియమించామన్నారు. పరీక్ష కేంద్రంలో వైద్య, పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. హాల్‌ టికెట్‌ వెరిఫికేన్‌కు మహిళ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.

మంచిర్యాల అర్బన్‌, (ఆంధ్రజ్యోతి): పట్టణం లోని ఆర్‌బీహెచ్‌వీ పాఠశాల, సివి రామన్‌ డిగ్రీ కళాశాల, నస్పూర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడి యం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రూప్‌-3 పరీ క్షా కేంద్రాలను డీసీపీ భాస్కర్‌ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్‌ షీట్స్‌ స్ర్టాంగ్‌ రూమ్‌కు తరలింపుపై అధికారులకు, సిబ్బందికి డీసీపీ సూచనలు చేశారు.

నస్పూర్‌, (ఆంధ్రజ్యోతి): నస్పూర్‌లోని జిల్లా పరిషత్‌ పాఠశాల తీగల్‌ పహాడ్‌, సింగరేణి పాలి టెక్నిక్‌ కళాశాల, సింగరేణి హైస్కూల్‌, మార్టిన్స్‌ గ్రామర్‌ స్కూల్‌, ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలల్లో నిర్వహిం చిన గ్రూప్‌-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరు కున్న పలువురు అభ్యర్థులకు అధికారులు లోప లికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

మందమర్రిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): మందమర్రి లో గ్రూప్‌ 3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్య ర్ధులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకున్నారు. పట్టణంలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 వేల మందికి పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సీఐ శశిధర్‌రెడ్డి తనిఖీ చేశారు. కార్మెట్‌ హైస్కూల్‌ పరీక్ష కేంద్రం వద్ద ఎస్‌ఐ రాజశేఖర్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Nov 17 , 2024 | 10:26 PM